twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్ నెక్ట్స్ ఫిల్మ్ ‘ఛపాక్’... యాసిడ్ దాడి బాధితురాలి కథతో!

    |

    దీపిక పదుకోన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'పద్మావత్' తర్వాత ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. 2018 సంవత్సరం అంతా రణవీర్ సింగ్‌తో గడపటం, పెళ్లి ప్లానింగ్, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అంశాలపైనే ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టారు. గత నెల దీపిక-రణవీర్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

    పెళ్లి వేడుక ముగియడంతో దీపిక పదుకోన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో చేయబోయే సినిమాను దీపిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఈ చిత్రానికి 'ఛపాక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఢిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.

    Deepika Padukone next Chhapaak details

    ఛపాక్ గురించి దీపిక వెల్లడిస్తూ.. 'గాయపడి, గెలిచిన వ్యక్తి కథ. మనిషి యొక్క బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలిజేసే కథ. ఇలాంటి కథ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా రాబోతోంది' అని తెలిపారు.

    ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2019 మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుంది. 'ఛపాక్‌' ప్రాజెక్టులో విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించన్నారు. దీపిక లక్ష్మీ అగర్వాల్ పాత్ర పోషిస్తుండగా ఆమె భర్త, పాత్రికేయుడు అలోక్‌ దీక్షిత్‌ పాత్రలో విక్రాంత్‌ మస్సే కనిపించనున్నారు.

    'తాను అనుకున్న పాత్రలకు పర్ఫెక్టుగా సూటయ్యే యాక్టర్స్ దొరికారు. లక్ష్మీ అగర్వాల్ పాత్రకు దీపిక సరిగ్గా సరిపోతుంది. 'ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌' సినిమా చూసినప్పటి నుంచి విక్రాంత్‌తో పని చేయాలనుకుంటున్నాను' అని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెలిపారు.

    English summary
    Deepika Padukone made a formal announcement about collaborating with Meghna Gulzar on her production, Chhapaak, which will feature her as an acid attack survivor from Delhi, Laxmi Agarwal. "A story of trauma and triumph. And the unquashable human spirit. Elated to collaborate with Fox Star Studios on." Deepoka tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X