దీపిక పదుకోన్ పార్టీలో యువ ఇద్దరు హీరోలు.. ఓ హీరోయిన్.. వైరల్‌గా ఫోటోలు

బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయ సాహా వాట్సాప్ ఛాట్‌ లీక్ సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ఈ వాట్సాప్ ఛాట్‌లో దీపిక పదుకోన్ ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పేర్లు బయటకు రావడం సంచలనం రేపుతున్నది. వాట్సాప్ ఛాటింగ్‌లో వెలుగు చూసిన కోకో రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో ఇద్దరు యువ హీరోల పేర్లు, మరో హీరోయిన్ పేరు తెరపైకి రావడం మరింత గందరగోళానికి గురిచేస్తున్నది. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే..

కోకో రెస్టారెంట్‌లో నైట్ పార్టీ

కోకో రెస్టారెంట్‌లో నైట్ పార్టీ

2017 సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన టాలెంట్ మేనేజర్ జయా సాహాతో జరిగిన చాటింగ్లో నీ దగ్గర మాల్ (సరుకు) ఉందా? అంటూ మేనేజర్ కరిష్మాను దీపిక పదుకోన్ అడిగింది. అయితే రాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల మధ్య కోకో రెస్టారెంట్‌కు వస్తాను. నాకు వీడ్ వద్దు.. హాష్ కావాలి అంటూ వాట్సప్‌లో మెసేజ్ చేయడం ఎన్సీబీ అధికారులు దృష్టికి వచ్చింది.

పార్టీలో యువ హీరోలు, హీరోయిన్

పార్టీలో యువ హీరోలు, హీరోయిన్

అక్టోబర్ 28వ తేదీ రాత్రి దీపికా పదుకోన్ తన స్నేహితులతో కలిసి కోకో రెస్టారెంట్‌లో తెల్లవారే వరకు పార్టీ జరుపుకొన్నారు. ఆ పార్టీకి బాలీవుడ్ యువ హీరోలు సిద్దార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా హాజరయ్యారనే విషయం ఎన్సీబీ అధికారుల గుర్తించారు. ఇప్పడు ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పద్మావతి సినిమాకు ముందు

పద్మావతి సినిమాకు ముందు

పద్మావతి సినిమా వివాదం జోరుగా కొనసాగుతున్న సమయంలో దీపికా పదుకోన్ పార్టీని నిర్వహించినట్టు తెలిసింది. తన సినిమా రిలీజ్‌కు ముందు తన సన్నిహితులతో పార్టీని చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు, అలాగే పార్టీ నుంచి బయటకు వెళ్లున్న దీపిక పదుకోన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
సారా, శ్రద్దా, దీపిక, రకుల్‌కు సమన్లు జారీ చేసే అవకాశం

సారా, శ్రద్దా, దీపిక, రకుల్‌కు సమన్లు జారీ చేసే అవకాశం

ఇక ఎన్సీబీ వర్గాల ప్రకారం.. ప్రస్తుత వారంలో దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్‌, సారా ఆలీ ఖాన్‌కు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. తాజాగా వెలుగు చూసిన జయా సహా వాట్సప్ చాటింగ్, విచారణలో ఆమె వెల్లడించిన సంచలన విషయాల ఆధారంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు జారీ చేసి విచారిస్తాం అని ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ వారం సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైమోన్ ఖంబాట్టా, శ్రద్దాకపూర్, దీపికా పదుకోన్‌కు సమన్లు వెళ్లే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X