Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దీపికా వాగుతూనే ఉంటుంది.. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందంటూ రణ్ వీర్ ఫిర్యాదు..
బాలీవుడ్ క్యూట్ కపూల్స్‌లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ జంట ముందుంటారు. వీరు బయటకు వచ్చారంటే.. మీడియాకు ఇక పండగే. రన్ వీర్ చేసే చేష్టలు, దీపికాపై చూపే ప్రేమ ఇలా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో జంటగా నటించిన వీరు.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. వీరి అభిమానులు ముద్దుగా దీప్ వీర్ అని పిలుచుకుంటారు..
భార్యపై అమితమైన ప్రేమ..
తన భార్య దీపికాపై రణ్వీర్ సింగ్‌కు అమితమైన ప్రేమ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది చాలా విషయాల్లో స్పష్టమైంది కూడా. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఆమెను చూసుకోవడం, ఆమెను వెంటపెట్టుకుని నడవడం లాంటివి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఒకసారి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా.. జారి పడిపోయే సమయంలో పట్టుకోవడం, ఇంకో ఫంక్షన్లో దీపికాకు ఇబ్బందిగా ఉందంటే.. ఆమె చెప్పులను చేతులతో పట్టుకుని నడవడం ఇవన్నీ వీరి అభిమానుల మనసులను దోచుకున్నాయి.
|
వాగుతూనే ఉంటుంది.. ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది..
తాను చదువుకునే రోజుల్లో నిత్యం వాగుతూనే ఉండేదంటా.. ఇదే విషయాన్ని టీచర్స్ రిమార్క్‌గా రాసేవారని దానికి సంబంధించిన ప్రొగ్రెస్ కార్డ్ లాంటి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ఓహో.. అవును అన్నట్లు ఓ ఎమోజీని జత చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి రణ్ వీర్ కామెంట్ చేస్తూ.. ట్రబుల్ మేకర్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పోస్ట్ కు 9 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
సింబా, గల్లీబాయ్ తో హిట్ కొట్టిన రణ్ వీర్..
సింబా, గల్లీ బాయ్ తో హిట్ కొట్టిన రణ్ వీర్ కు దీపికాతో పెళ్లి అయ్యాక బాగానే కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. పెళ్లికి మునుపు వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌లో దుమ్ములేపాయి. యే జవానీ హై దివానీ, భాజీరావ్ మస్తానీ, రామ్ లీలా సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. చివరగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పద్మావతి సినిమా బంపర్ హిట్ గా నిలిచింది. కపిల్ దేవ్ కథతో తెరకెక్కుతున్న 83 చిత్రంలో నటిస్తున్నాడు.