డ్రగ్స్‌తో దీపిక, రణ్‌బీర్ దమ్మారో దమ్.. వీడియో షేర్ చేసిన ఎమ్మెల్యే.. నా భార్య కూడా ఉందని!
Recommended Video
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వివాదం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నది. ఈ పార్టీకి బాలీవుడ్‌లోని ప్రముఖ తారలు పాల్గొనడంతో ఈ వివాదం మరింత క్రేజీగా మారింది. ఈ వివాదంపై రెండు రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..



కరణ్ జోహర్ పార్టీలో
బాలీవుడ్‌లోని తన స్నేహితులకు ఇటీవల కరణ్ జోహర్ విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి దీపిక పదుకోన్, రణ్‌బీర్ కపూర్, వికీ విశాల్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహీద్ కపూర్, దర్శకుడు ఆయన్ ముఖర్జీ, ఇతరులు కొద్ది మంది పార్టీకి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉపయోగించారనే ఆరోపణలు రావడంతో వివాదంగా మారింది.

శిరోమణి ఎమ్మెల్యే సిర్సా ఆరోపణ
కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీపై శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మజిందర్ సిర్సా ఆరోపణలు చేశాడు. ఈ విందులో ఎక్కువ మొతాదులో డ్రగ్స్ ఉపయోగించారు అని ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను ట్వీట్ చేశారు. అయితే సిర్సా ఆరోపణలను కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు. దాంతో వీరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకొన్నాయి.
ఇదే రియాలిటీ చూడండి
ఫిక్షన్ ఏంటో, రియాలిటీ ఏంటో మీరే చూడండి. బాలీవుడ్‌కు చెందిన టాప్ సెలబ్రిటీలు ఎలా మద్యం మత్తులో జోగుతున్నారో చూడండి. తారలు డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా నా గళం వినిపిస్తున్నాను. ఇది చూస్తే షాహీద్ కపూర్, దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, కరణ్ జోహర్, వికీ కౌశల్‌పై మీ అభిప్రాయం, గౌరవం మారిపోతుంది అని సిర్సా ట్వీట్‌లో పేర్కొన్నారు. వికీ కౌశల్ పక్కనే డ్రగ్స్ ఉన్న ఫొటో వైరల్ అవుతున్నది.

డ్రగ్స్ వాడలేదు.. నా భార్య కూడా ఉంది
సినీ తారల డ్రగ్స్ వాడకంపై సిర్సా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా ఖండించారు. సినీ తారలు పాల్గొన్న పార్టీలో నా భార్య కూడా ఉన్నారు. పార్టీలో డ్రగ్స్ వాడకం జరుగలేదు. సినీ తారలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇలాంటి అసత్య ఆరోపణలను చేయడం ఆపివేయాలి. లేకపోతే పరువు నష్టం దావా వస్తారు అని అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని దియోరా కామెంట్ చేశారు.

రణ్‌వీర్, ఆలియా గైర్హాజర్
కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన పార్టీకి మాజీ ప్రేమికులు దీపికా, రణ్‌బీర్ హాజరయ్యారు. అయితే దీపికా భర్త రణ్‌వీర్ గానీ, రణ్‌బీర్ కపూర్ ప్రియురాలు ఆలియాభట్ పార్టీకి హాజరుకాలేదు. రణ్‌వీర్ ప్రస్తుతం 83 సినిమా షూటింగ్‌లో ఉండగా, ఆలియా భట్ సడక్ 2 సినిమా షూట్ కోసం ఊటీలో ఉన్నారు. అందుకే వీరిద్దరూ ఈ పార్టీలో కనిపించలేదనే బాలీవుడ్ పత్రికల కథనం.


Click it and Unblock the Notifications











