ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.. సెక్స్ కోసమేనా అఫైర్.. అతడిని అందుకే వదిలేశా.. దీపిక

By Rajababu

Recommended Video

Deepika Padukone Talks About Ranbir Kapoor

సినిమా పరిశ్రమలో ఎవరికైనా లవ్ బ్రేకప్ అయితే స్నేహితులుగా ఉండిపోతాం అని చెప్పడం సహజం. అందుకు సాక్ష్యంగా రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొన్ కనిపిస్తారు. 2007లో జోరుగా వారిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. 2008లో బచ్నా యే హసీనా అనే చిత్ర షూటింగ్‌లో ప్రేమలో మునిగిపోయారు. వారి మధ్య గాఢమైన ప్రేమ వైఫల్యం చెందినా.. ఎలాంటి కోపతాపాలు లేకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌తో రిలేషన్ గురించి ఆసక్తికరమైన సంఘటనలు చెప్పారు.

కత్రినాతో రెడ్‌హ్యాండెడ్‌గా

కత్రినాతో రెడ్‌హ్యాండెడ్‌గా

ఓ దశలో మేమిద్దరం గాఢమైన ప్రేమలో ఉన్నాం. ఆ సమయంలో నేను అతడిని బాగా నమ్మాను. కానీ కత్రినాకైఫ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో నేను చాలా కుంగిపోయాను. అందుకే నేను గుడ్‌బై చెప్పాను అని దీపికా పదుకొన్ చెప్పింది. అప్పటి నుంచి స్నేహితులుగానే ఉండిపోయామన్నారు.

సెక్స్ అంటే నా దృష్టిలో

సెక్స్ అంటే నా దృష్టిలో

నాకు సెక్స్ అంటే కేవలం శారీరక సుఖం కాదు. అది నా దృష్టిలో భావోద్వేగం. నేను అతడితో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చీట్ చేయలేదు. నేను నమ్మిన వ్యక్తి మోసగిస్తున్నప్పుడు రిలేషన్ కొనసాగించడం కష్టమనిపించింది. సింగిల్‌గా ఉంటేనే హ్యాపీ అనిపించింది. అందుకే అతడిని వదిలేశాను అని దీపికా ఆవేదన వ్యక్తం చేశారు.

సెకండ్ ఛాన్స్ ఇవ్వమని

సెకండ్ ఛాన్స్ ఇవ్వమని

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత రణ్‌బీర్‌కు రెండో అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మరోసారి ఫూల్ కాదలుచుకోలేదు. ఆ ఘటన తర్వాత సెకండ్ ఛాన్స్ ఇవ్వమని నా వెంట పడ్డాడు. తప్పు జరిగిందని వేడుకొన్నాడు. చాలా మంది క్షమించమని చెప్పారు. ఒకసారి కళ్లముందు ఓ సంఘటన చూసిన తర్వాత చాలా హర్ట్ అయ్యాను. క్షమించడం వేస్ట్ అని అనుకొన్నాను అని దీపిక చెప్పింది.

అతడి బిహేవియర్ అదే

అతడి బిహేవియర్ అదే

మొదటిసారి నన్ను చీట్ చేసిన తర్వాత మా రిలేషన్ తప్పనిపించింది. అలా వ్యవహరించడం అతడి అలవాటు అని తెలిసింది. ఒకసారి అతని బిహేబియర్ తెలిసిన తర్వాత అతను నాకు సరికాదు అనిపించింది. రిలేషన్‌లో ఉన్న చాలా సమర్పించుకొన్నాను. తిరిగి ఆశించలేదు. మనచుట్టు ఉన్నవాళ్లతో పడుకోవడం సరికాదు అనేది నా అభిప్రాయం.

రణ్‌బీర్ రిలేషన్ ఓ గుణపాఠం

రణ్‌బీర్ రిలేషన్ ఓ గుణపాఠం

రణ్‌బీర్‌తో రిలేషన్ నాకు జీవితంలో ఓ పెద్ద గుణపాఠం. ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మవద్దు అని తెలుసుకొన్నాను. బ్రేకప్ తర్వాత నన్ను నేనుగా గౌరవించుకొన్నాను. అతడికి దూరమైన తర్వాత మానసికంగా చాలా కష్టాలు అనుభవించాను. ఆ విషాదం నుంచి బయటపడి మంచి మనిషినయ్యాను. అందుకు రణ్‌బీర్‌కు రుణపడి ఉంటాను అని దీపిక చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X