వివాదంలో దీపిక, రణ్‌వీర్ సింగ్ పెళ్లి.. మత పెద్దల దృష్టికి ఉల్లంఘనలు
దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ పెళ్లి విషయంలో అంతా సవ్యంగా జరుగుతున్నదనుకొంటే చిన్న ఝలక్ తగిలింది. వీరి పెళ్లి కొంకణి, ఆనంద్ కరాజ్ వివాహ పద్దతిలో ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం జరిపించిన తీరుపై ఇటలీ సిక్కు సంస్థ కన్నెర్ర జేసింది. దీపిక, రణ్‌వీర్ పెళ్లి కొంకణి పద్దతిలో నవంబర్ 14న, సిక్కు మత ఆచారం ప్రకారం నవంబర్ 15న జరిగిన సంగతి తెలిసిందే.
గురుద్వారాలో జరుగాల్సిన పెళ్లితంతులో కొన్ని మత నిబంధనలను ఉల్లంఘించారని అఖల్ తఖ్త్ సంస్థ ఆరోపణలు చేసింది. ఈ వివాహ తీరును ఐదుగురు మత గురువుల దృష్టికి తీసుకెళ్తామని.. వారే తుది నిర్ణయం తీసుకొంటారని అఖల్ తఖ్త్ ప్రతినిధి మీడియాతో అన్నారు.

పెళ్లి తర్వాత దీపిక, రణ్‌వీర్ స్వదేశానికి తిరిగి వచ్చారు. 21న బెంగళూరులో జరిగే విందులో నవ దంపతులు పాల్గొంటారు. ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా నవంబర్ 28న మరో విందును కూడా ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











