తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపిక, రణ్ వీర్.. పెళ్లై ఏడాది గడిచాక!!

Recommended Video

Deepika Padukone, Ranveer Singh Celebrate First Wedding Anniversary In Tirumala

స్టార్ హీరో హీరోయిన్లు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటవ్వడం, ఆ తర్వాత వాళ్ళు చేసే షికార్లు, వేసే టూర్లు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచే అంశాలే. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకొని వార్తల్లో నిలిచింది.

మొదటి వార్షికోత్సవం సందర్బంగా..

మొదటి వార్షికోత్సవం సందర్బంగా..

గతేడాది ఇదే నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు దీపికా పదుకొనే- రణ్ వీర్ సింగ్. విదేశాల్లోని ఓ అందమైన లొకేషన్‌కి వెళ్లి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎంతో అన్యున్యంగా గడుపుతున్న ఈ జంట మొదటి వార్షికోత్సవం సందర్బంగా తిరుపతి వెళ్లారు.

 కుటుంబమంతా కలిసి.. ప్రత్యేక విమానంలో

కుటుంబమంతా కలిసి.. ప్రత్యేక విమానంలో

తన కుటుంబ సభ్యులందరితో కలిసి దీపికా పదుకొనే- రణ్ వీర్ సింగ్ తిరుపతి చేరుకున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన వీరు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. ఈ రోజు ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

 సోషల్ మీడియాలో దీపికా పదుకొనే

సోషల్ మీడియాలో దీపికా పదుకొనే

తాజాగా తమ తిరుపతి టూర్ విశేషాలను, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీపికా పదుకొనే. ఈ ఫొటోల్లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణతో కనిపించారు. ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్ వీర్ లను చూసి అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటలీలో ఒక్కటైనా దీపికా జంట

ఇటలీలో ఒక్కటైనా దీపికా జంట

గతేడాది నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని కొమో ఐల్యాండ్ లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. సింధీ తరహాలో ఈ పెళ్లి జరిగింది. పద్మావత్ తరహా దుస్తులు ధరించి ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోవడం, ఎంతో ఫన్నీగా ఈ పెళ్లి వేడుక జరగడటంతో అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X