80 ఏళ్ల దీపిక, రణ్‌వీర్.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫొటో
చాలా కాలం రహస్యంగా ప్రేమాయణం సాగించి, కొద్దినెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్. వివాహం జరిగినప్పటి నుంచి తరచూ కెమెరా కంటికి చిక్కుతూ వార్తల్లో నిలుస్తోంది ఈ జంట. గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన దీప్ వీర్.. పెళ్లైన తర్వాత తొలిసారి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే '83'. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్ వీర్.. లెజండరీ క్రికెటర్‌గా కనిపిస్తుండగా.. దీపిక ఆయన భార్య రోమీ భాటియా పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కపిల్ చిన్నప్పటి నుంచి 1983లో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన రోజు వరకు ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది. రణ్ వీర్ ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేశాడు. దీని కోసమే చాలా నెలల పాటు క్రికెట్ నేర్చుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు, లుక్ పరంగానూ చాలా మార్పులు చూపించాడు. ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలాఉండగా, ఆదివారంతో రణ్ వీర్, దీపిక జంట వివాహం జరిగి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. దీంతో వాళ్ల అభిమానులు ఓ ఫొటోను క్రియేట్ చేశారు. రణ్ వీర్ సింగ్ గ్లోరియస్ అనే ఫ్యాన్ క్లబ్ ఈ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ జంట ఎనభై ఏళ్ల వయసులో ఉన్నట్లు తయారు చేయడమే. ఇందులో దీపిక, రణ్ వీర్ ముసలి వాళ్లలా కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఇద్దరూ ఎంతో అందంగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ఫ్యాన్ క్లబ్ ''ఎంత అద్భుతం ఇది. వివాహం జరిగి ఎనిమిది నెలలు పూర్తయిన సందర్భంగా ప్రియమైన జంటకు శుభాకాంక్షలు'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.


Click it and Unblock the Notifications










