లేక్ కోమో పెళ్లి జ్ఞాపకాలు: భర్తకు లడ్డూ తినిపిస్తున్న దీపిక, నేడు బెంగుళూరులో రిసెప్షన్!
Recommended Video

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(బుధవారం) బెంగుళూరులో జరుగబోతోంది. ఇక్కడి లీలా ప్లాలెస్ ఇందుకు వేదిక కానుంది. నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీ లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఏకమైన ఈ ప్రేమ జంట ఆదివారం ముంబై వచ్చారు. దీపిక అత్తారింట్లో రెండు రోజుల విశ్రాంతి అనంతరం మంగళవారం కొత్త దంపతులు బెంగుళూరు చేరుకున్నారు.
వెడ్డింగ్ రిసెప్షన్ వ్యవహారాలను దీపిక తల్లి ఉజ్జల దగ్గరుండి చూసుకుంటున్నారట. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సౌత్ ఇండియన్ స్టైల్, ముఖ్యంగా దీపిక కుటుంబ సాంప్రదాయమైన కొంకణి సంస్కృతి ప్రతిబింభించేలా ఉంటాయని సమాచారం.

ఎక్కువగా వచ్చేది వారే
ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఎక్కువగా దీపిక ఫ్యామిలీకి బంధువులు, సన్నిహితులు... దీపిక తండ్రి, బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనె ఫ్రెండ్స్, పలువురు కర్నాటక రాష్ట్ర ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత స్టైలిష్‌గా
ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో దీపిక, రణవీర్ సబ్యసాచి ఔట్‌ఫిట్స్ ధరిస్తారని తెలుస్తోంది. ఇటలీ లేక్ కోమో వెడ్డింగులో కూడా ఈ జంట సబ్యసాచి డిజైన్ చేసిన పెళ్లి దుస్తువుల్లోనే దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న పెళ్లి జ్ఞాపకాలు
కాగా... మంగళవారం సాయంత్రమే దీపిక, రణవీర్ దంపతులు తమ లేక్ కోమో వెడ్డింగుకు సంబంధించిన మరిన్ని ఫోటోస్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ముంబైలో సెకండ్ రిసెప్షన్
కాగా... దీపిక, రణవీర్ సెకండ్ రిసెప్షన్ నవంబర్ 28న ముంబైలో ప్లాన్ చేశారు. మరో వారం రోజుల తర్వాత జరుగబోయే ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











