దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ నేడే, వివరాలు!
ఇటలీలోని లేక్ కోమోలో నవంబర్ 14. 15 తేదీల్లో పెళ్లి చేసుకున్న దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ బెంగుళూరులో వారం క్రితం ఫస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకున్న సంగతి తెలిసిందే. లీలా ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో దీపిక ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ హాజరయ్యారు. ముంబైలో నేడు (నవంబర్ 28) సెకండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.
ముంబైలో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఎంతో అందంగా ఇన్విటేషన్ డిజైన్ చేయించారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో రాత్రి 8 గంటల నుంచి వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ మొదలు కాబోతోంది. ఈ వేడుకలో రణవీర్ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ పాల్గొనబోతున్నారు. ఇండియన్ మీడియాను సైతం ఆహ్వానించారు.
ఇక సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల కోసం ఇదే గ్రాండ్ హయత్ హోటల్‌లో డిసెంబర్ 1న మరో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. ఈ మేరకు ఇప్పటికే సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ అందాయట.

డిసెంబర్ 1న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్ కోసం రణవీర్ సింగ్... కత్రినా కైఫ్‌ను సైతం ఆహ్వానించారట. దీపిక తన మాజీ ప్రియుడు రణవీర్ సింగ్‌తో విడిపోయిన తర్వాత రణవీర్-కత్రినా సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రణవీర్ ఆమెను ఆహ్వానించడం చర్చనీయాంశం అయింది.
కాగా.. దీపిక, రణవీర్ తమ సెకండ్ వెడ్డింగ్ రిసెప్షన్లో ఎలాంటి దుస్తుల్లో దర్శనమిస్తారో? ని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి దుస్తులను ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ సవ్యసాచి రూపొందించారట.


Click it and Unblock the Notifications











