దీపిక, రణ్‌వీర్ రిసెప్షన్: జిగేల్‌మనేలా లీలా మహల్.. ఫుడ్ మెను ఏంటో తెలుసా?

Recommended Video

Deepika-Ranveer Wedding Reception : Leela Mahal Was All set For Reception

బాలీవుడ్ స్టార్ దంపతులు దీపిక పదుకొన్, రణ్‌వీర్ సింగ్ పెళ్లి విందుకు బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్ వేదికగా మారింది. ఇప్పటికే ఈ హోటల్‌ను కళ్లు చదిరేలా అలంకరించారు. బుధవారం (నవంబర్ 21వ తేదీ) 7 గంటల ప్రాంతంలో విందు వేడుకలు ప్రారంభమవుతాయి. హిందీ, కన్నడ, తెలుగు సినిమా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఫుడ్, పెళ్లిదుస్తులు, భద్రత గురించి వివరాల్లోకి వెళితే..

ఇటలీలో దీప్ వీర్ వివాహ వేడుకలోని అరుదైన ఫొటోలు

ఫ్యాన్స్‌ను పలకరించిన దీపికా, రణ్‌వీర్ సింగ్

ఫ్యాన్స్‌ను పలకరించిన దీపికా, రణ్‌వీర్ సింగ్

దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ మంగళవారం ముంబై నుంచి బెంగళూరుకు చేరుకొన్నారు. దీపిక ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులకు నవదంపతులు పలకరించారు. దీపిక దంపతులను చూసి అభిమానులను పులకరించిపోయారు. కేరింతలతో హంగామా సృష్టించారు.

లీలా మహల్ హోటల్‌లో

లీలా మహల్ హోటల్‌లో

విజయనగర సామ్రాజ్య అర్కిటెక్చర్ ఉట్టిపడేలా లీలా మహాల్ హోటల్ ఉంటుంది. లీలా ప్యాలెస్ చైన్ హోటళ్లను సీపీ కృష్ణన్ నాయర్ అనే వ్యక్తి తన భార్య లీల పేరు మీద 1986లో స్థాపించాడు. ఏడు ఎకరాల్లో ఈ హోటల్ విస్తరించి ఉంది. పచ్చిక బయళ్లు, గార్డెన్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందంగా రిసెప్షన్ వేదిక

అందంగా రిసెప్షన్ వేదిక

మీడియా కథనాల ప్రకారం దీపిక, రణ్‌వీర్ పెళ్లి రిసెప్షన్ లీలా మహల్ హోటల్‌లోని గ్రాండ్ బాల్‌రూమ్‌లో జరుగుతుంది. ఇప్పటికే రిసెప్షన్ కావాల్సిన వేదికను అందంగా ముస్తాబు చేసినట్టు తెలుస్తుంది. పరిసర ప్రాంతాల్లో కళ్లు జిగేల్ మనిపించేలా లైటింగ్, డెకరేషన్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. భారీ ప్రముఖులు హాజరుకావడంతో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ప్రత్యేకంగా డిజైన్ దుస్తులు

ప్రత్యేకంగా డిజైన్ దుస్తులు

పెళ్లి విందు కొరకు దీపిక, రణ్‌వీర్ సింగ్ కోసం ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేశారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తులును వీరు ధరిస్తారు. పెళ్లి సందర్భంగా సంప్రదాయ దుస్తులను సవ్యసాచి డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి, సింధి సంప్రదాయ పద్దతుల్లో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే.

దీపిక తల్లి పర్యవేక్షణలో

దీపిక తల్లి పర్యవేక్షణలో

పెళ్లి విందుకు వచ్చే అతిథుల కోసం దక్షిణాది, ఉత్తరాది వంటలను సిద్ధం చేస్తున్నటట్టు తెలిసింది. నోరూరించే విధంగా ఫుడ్‌ను అందించడానికి ప్రముఖ క్యాటరింగ్ కంపెనీకి చెందిన వంటగాళ్లు రంగంలోకి దిగారు. దీపిక తల్లి ఉజ్జల వంటకాల తయారీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X