»   » పెళ్లికి ముందే.... ప్రియుడితో దొరికిపోయిన దీపిక పదుకోన్! (వీడియో)

పెళ్లికి ముందే.... ప్రియుడితో దొరికిపోయిన దీపిక పదుకోన్! (వీడియో)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  పెళ్లికి ముందే.... ప్రియుడితో దొరికిపోయిన దీపిక పదుకోన్!

  దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో వీరు త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు కూడా. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరికీ సినిమా షూటింగ్స్ గ్యాప్ దొరకడంతో పెళ్లి తర్వాత చేయాల్సినవన్నీ పెళ్లికి ముందే పూర్తి చేస్తున్నారు. ప్రియుడు రణవీర్‌తో కలిసి రహస్యంగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీపిక.... అభిమానులకు దొరికిపోయింది. కొందరు వారిని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

  డిస్నీలాండ్‌లో ప్రీ-వెడ్డింగ్ వెకేషన్

  ప్రస్తుతం రణవీర్, దీపిక యూఎస్ఏ ఓర్లాండోలోని డిస్నీ‌ల్యాండ్‌లో పర్యటిస్తున్నారు. అసలు వీరి పర్యటనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఉన్నట్టుండి వీరు అక్కడ దర్శనమివ్వడంతో కొందరు ఫ్యాన్స్ వారిని వీడియో తీశారు. ఈ పర్యటనను ప్రీ వెడ్డింగ్ వెకేషన్‌గా పేర్కొంటున్నారు.

  పెళ్లికి ముందే..

  సాధారణ మధ్యతరగతి జనాలకు పెళ్లికి ముందే ఏంటి ఇదంతా అనే సందేహం రావొచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందులోనూ బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అయిన దీపిక, రణబీర్ లాంటి వారికి ఇదంతా సర్వసాధారణం.

  వీరితో పాటు అనిషా కూడా...

  వీరితో పాటు అనిషా కూడా...

  ఈ వెకేషన్లో వీరితో పాటు దీపిక సోదరి అనీషా పదుకోన్ కూడా ఉండటం గమనార్హం. త్వరలోనే తనకు కాబోయే బావగారితో మరింత క్లోజ్ అయ్యేందుకు ఈవెకేషన్ మంచి ఆప్షన్ అనుకుందో ఏమో?. కొన్ని రోజుల ముందు నుండే రణవీర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడం మొదలు పెట్టింది అనీషా.

   నవంబర్ 10న వివాహం

  నవంబర్ 10న వివాహం

  దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 10న జరుగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం ఇటలీలో ప్లాన్ చేశారని, అక్కడి లాంబార్డీ ప్రాంతంలోని లేక్ కోమో అనే ప్రాంతం ఈ ప్రేమ జంట వివాహానికి వేదిక కానుందని సమాచారం.

  పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులు

  పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులు

  ఇటలీలో జరిగే రణవీర్-దీపిక డెస్టికేషన్ వెడ్డింగుకు పరిమిత సంఖ్యలో మాత్రమే గెస్టులు హాజరు కానున్నారట. షారుక్ ఖాన్, అర్జున్ కపూర్‌తో పాటు మరికొందరు బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన బోతున్నారట. పెళ్లి వేడుక తర్వాత బెంగుళూరులో ఫ్యామిలీ రిలేషన్స్ కోసం ఓ రిసెప్షన్, అనంతరం బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం ముంబైలో ఓ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

  English summary
  Deepika Padukone and Ranveer Singh are reportedly all set to tie the knot in Italy on November 10. While the preparations for their impending wedding is in full swing, Deepika and Ranveer were caught spending quality time on their secret romantic getaway at Disneyland in Orlando, USA.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more