twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ వెడ్డింగ్: లేక్ కోమోను ఎంచుకోవడానికి కారణమేంటి?

    |

    బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఇటలీలోని లేక్ కోమో వీరి వివాహానికి వేధిక కానుంది. అయితే వీరు తమ డెస్టినేషన్ వెడ్డింగుకు ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది.

    ఉత్తర ఇటలీలోని ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం సుందరమైన ఈ ప్రదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే. ముఖ్యంగా హాలీవుడ్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ హాలీవుడ్ మూవీలో నటించిన దీపిక తన స్టేటస్‌కు తగిన విధంగా ఉంటుందనే ఈ ప్రదేశాన్ని ఎంచుకుంది.

    అద్భుతమైన కట్టడాలు

    అద్భుతమైన కట్టడాలు

    ఇటాలియన్ ఆర్కిటెక్చర్‌తో కూడిన అక్కడి కట్టడాలు.... వివాహ వేడుకకు రాయల్ లుక్ తెస్తుంది. అన్నింటినీ మించి అద్భుతమైన ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రపంచ ప్రఖ్యాత ప్రదేశాల్లో ఒకటిగా ఈ ప్రాంతం ఉంది.

    టూరిస్టులకు నో ఎంట్రీ

    టూరిస్టులకు నో ఎంట్రీ

    లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లో అనే ప్యాలెస్‌లో రణవీర్, దీపిక వివాహం జరుగబోతోంది. పెళ్లి వేడుక జరిగే రెండు రోజులు ఆ ప్రాంతంలోకి టూరిస్టులను అనుమతించరట. ఈ మేరకు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

    బిగ్గెస్ట్ బాలీవుడ్ వెడ్డింగ్

    బిగ్గెస్ట్ బాలీవుడ్ వెడ్డింగ్

    దీపిక, రణవీర్ ఆదివారమే కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఓ వెడ్డింగ్ ఏజెన్సీ లేక్ కోమోలో వీరి పెళ్లి వేడుకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ వెడ్డింగ్స్‌లో ఒకటిగా రణవీర్-రణవీర్ దీపిక వివాహం చరిత్రకెక్కుతుందని అంటున్నారు.

    వెడ్డింగ్ వెన్యూ టాప్ వ్యూ

    వెడ్డింగ్ వెన్యూ టాప్ వ్యూ

    రణవీర్, దీపిక వివాహం జరిగే విల్లా దెల్ బాల్బియానెల్లో ప్యాలెస్ టాప్ వ్యూ ఇక్కడి ఫోటోలో చూడొచ్చు. ఎవరి జీవితంలో అయినా వివాహ వేడుకను మించిన పెద్ద వేడుక ఉండదు. అలాంటి వేడుకను ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు.

    English summary
    Deepika Padukone and Ranveer Singh are currently in Italy getting prepped up for their wedding on November 14 and 15 at the breathtaking Lake Como and though the couple have have shared a single picture, their hairstylist and manager have shared a few pictures on their Instagram stories giving us a glimpse of how the DeepVeer wedding unfolds. Each picture is making fans excited and we're all eager for their wedding day to come soon. Afterall, the Deepika Padukone and Ranveer Singh wedding would be the greatest nupital ceremony we've ever seen in 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X