మతి పోగొడుతున్న లేక్ కోమో అందాలు: దీపిక-రణవీర్ పెళ్లి జరిగేది ఇక్కడే.. (ఫోటోస్)
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15 తేదీల్లో తమ వివాహ వేడుక జరుగబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
జీవితంలో జరిగే అతిపెద్ద ఈవెంట్ కావడంతో దీన్ని స్పెషల్‌గా ప్లాన్ చేసున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతోంది. అయితే లేక్ కోమోలో వీరి వివాహం ఎక్కడ జరుగబోతోందనే విషయం లీకైంది.

వివాహం జరిగే విల్లా ఇదే...
లేక్ కోమోలో ఉన్న ‘దెల్ బాల్బియానెల్లో' అనే విల్లాలో వీరి వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విల్లాలో వివిధ దేశాలకు చెందిన ధనవంతులు, ప్రముఖుల వివాహాలు జరిగాయి. ఈ విల్లాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

18వ శతాబ్దం నాటి భవంతి
‘దెల్ బాల్బియానెల్లో' భవంతిని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇది హాలివుడ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఎంతో ఇష్టమైన ప్రదేశం. గతంలో స్టార్ వార్స్‌తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల షూటింగ్ సైతం ఇక్కడ జరిగింది. ఇదే ఏరియాలో కొందరు హాలివుడ్ సెలబ్రిటీలకు ప్రాపర్టీస్ సైతం ఉన్నాయి.

అందమైన ప్రదేశం
సరస్సు ఒడ్డున ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రకృతి అందాలను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చుట్టూ ఉన్న కొండలు ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మార్చాయి.

రెండు సాంప్రదాయాల్లో
కాగా... వీరి పెళ్లి వేడుక రెండు సాంప్రదాయాల్లో జరుగనుందట. దీపిక పదుకోన్ బెంగుళూరు అమ్మాయి కావడంతో సౌత్ సాంప్రదాయం ప్రకారం.... రణవీర్ సింగ్ మహారాష్ట్ర సింధి వంశానికి చెందిన వ్యక్తి కావడంతో వారి సాంప్రదాయం ప్రకారం వేర్వేరుగా పెళ్లి వేడుక జరుగనుందట.

అతి కొద్ది మంది అతిథులకే ఆహ్వానం
ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఇండియా వచ్చిన తర్వాత ముంబై, బెంగుళూరులో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











