దీపిక, రణ్‌వీర్ పెళ్లి రిసెప్షన్: దీపిక పదుకోన్‌కు అరుదైన బహుమతి.. భారీగా సెలబ్రిటీల హాజరు
బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభవంగా సాగుతున్నది. వీరి పెళ్లి విందుకు బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్ అందంగా ముస్తాబైంది. ఇప్పటికే వేదిక వద్దకు వధూవరులు చేరుకొన్నారు. అందంగా తయారైన నవదంపతులు మీడియాకు ఫోజిచ్చారు. దేశవ్యాప్తంగా దీపిక, రణ్‌వీర్ రిసెప్షన్‌పై ఆసక్తి నెలకొన్నది. వివరాల్లోకి వెళితే..

దీపికకు తల్లి అరుదైన గిఫ్ట్
దీపిక పెళ్లి విందుకు అరుదైన బహుమతి లభించింది. దీపిక తల్లి ఉజ్జల పదుకొన్ తన కూతురికి తన పెళ్లి చీరను బహుమతిగా అందించింది. దీపిక తల్లి ఉజ్జల పెళ్లి జరిగినప్పుడు బెంగళూరులోని అంగది గ్యాలేరియాను కొనుగోలు చేశారు.

స్వయంగా దీపిక పదుకోన్ తల్లి
దీపిక, రణ్‌వీర్ పెళ్లి విందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను తల్లి ఉజ్జల స్వయంగా చూసుకొంటున్నారు. అతిథులకు కోసం ఏర్పాటు చేసిన విందు సంబంధించిన వంటకాలన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ విందుకు ఎక్కువగా దక్షిణాది వంటకాలను గెస్టులకు రుచిచూపించబోతున్నారు.

సన్నిహితులు, స్నేహితులతో కళకళ
దీపిక, రణ్‌వీర్ పెళ్లి రిసెప్షన్‌కు వారి కుటుంబ సభ్యులు, తండ్రి ప్రకాశ్ పదుకోన్ సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. బంధువులు, అతిథులతో వేదిక కిక్కిరిసిపోయింది. సంగీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథులు ఆనందంతో ఉత్సాహం కనిపిస్తున్నారు.

హాజరైన సెలబ్రిటీలు
దీపిక, రణ్‌వీర్ పెళ్లి రిసెప్షన్ కోసం చాలా మంది ప్రముఖులు వచ్చారు. క్రికెటర్ అనిల్ కుంబ్లే, తన భార్య చేతనతో కలిసి వచ్చారు. బాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్, షట్లర్ పీవీ సింధు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి భార్య సుధా మూర్తి, కిరణ్ మజుందార్ కూడా ఉన్నారు.

ముంబైలో 28న మరో రిసెప్షన్
నవంబర్ 28న ముంబైలో సినీ, వ్యాపార వర్గాల కోసం విందును ఏర్పాటు చేశారు. పెళ్లి విందులోనూ దీపికా స్వచ్ఛంద సేవకు అవకాశం కల్పించింది. తమకు ఎవరైనా గిఫ్టులు అందించాలనుకొంటే, వాటిని డొనేషన్ల రూపంలో లివ్ లాఫ్ లైఫ్ ఫౌండేషన్‌కు ఇవ్వండి అని దీపిక రిక్వెస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ సేవలందిస్తున్నది.


Click it and Unblock the Notifications











