‘విరుష్క’ దారిలో దీపిక-రణవీర్... విదేశంలో పెళ్లి వేడుక!
బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి తాజాగా బాలీవుడ్లో ఓ వార్త హాట్ టాపిక్ అయింది. అనుష్క శర్మ-విరాట్ కోహ్లి మాదిరిగానే ఈ జంట కూడా విదేశంలో పెళ్లి వేడుక ప్రైవేట్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. విరాట్-అనుష్క వివామం డిసెంబర్ 11, 2017న ఇటలీలోని టుస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే.

వెడ్డింగ్ ప్లానింగులో బిజీ బిజీ
వివాహ వేడుక ఎక్కడ నిర్వహించాలనే విషయంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను దీపిక, రణవీర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టాప్ మోస్ట్ వెడ్డింగ్ ప్లానర్ ద్వారా వివిధ దేశాల్లోని వెడ్డింగ్ లొకేషన్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తమ వివాహాన్ని కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య జరుపుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకుంటున్నారని, హిందూ ట్రెడిషన్ ప్రకారం వీరి వివాహం జరుగబోతోందని టాక్.

ఆ విషయాలేవీ బయటకు రాకుండా
మీడియా హడావుడికి దూరంగా ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే రణవీర్-దీపిక ఈ నిర్ణయం తీసుకున్నారట. అందుకే తమ వివాహానికి సంబంధించిన వివారాలేవీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశంలో పెళ్లి వేడుక ముగిసిన తర్వాత ఇండియాలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

రెండు వెడ్డింగ్ రిసెప్షన్స్
ఇండియాలో రెండు రిస్పెప్షన్లు జరుగుతాయని తెలుస్తోంది. ముంబైలో సినీ ఇండస్ట్రీ, ఇతరుల కోసం ఒక రిసెప్షన్.... బెంగుళూరులో మరో వెడ్డింగ్ జరుగనున్నట్లు టాక్. పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన డేట్స్ వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

సబ్యసాచి ముఖర్జీ
కాగా... దీపిక పదుకోన్ వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ కోసం తన ఫేవరెట్ డిజైనర్ అయిన సబ్యసాచి ముఖర్జీని ఎంపిక చేశారట. అనుష్క-విరాట్ కోహ్లి పెళ్లి దుస్తులు కూడా సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.

వెడ్డింగ్ ఎప్పుడంటే...
దీపిక, రణవీర్ పెళ్లికి వేడుక సెప్టెంబర్-డిసెంబర్ మధ్య జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు తేదీలు షార్ట్ లిస్ట్ చేశారని, త్వరలోనే ఇందులో ఏదో ఒక డేట్ ఫైనలైజ్ చేస్తారని టాక్. డేట్, వివాహ వేదిక ఫైనల్ అయిన తర్వాత అతిథుల కోసం స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











