Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకింగ్: మాజీ లవర్ టాటూను తీసేసిన స్టార్ హీరోయిన్.. పెళ్లయిన చాలా రోజుల తర్వాత ఇలా.!
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్లో లవ్ ఎఫైర్లు ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు చాలా కాలం పాటు ప్రేమలో మునగడం.. ఆ తర్వాత కుదిరితే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే బ్రేకప్ చెప్పేసి ఎవరి దారి వారు చూసుకోవడం వంటివి అక్కడ సర్వ సాధారణం. అందుకే బీ టౌన్లో ఎఫైర్స్ గురించి రోజుకో వార్త అయినా బయటకు వస్తోంది. గతంలో హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. తర్వాత అతడికి బ్రేకప్ చెప్పేసి.. కొన్నేళ్ల కిందట మరో హీరోను పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ చేసిన పని చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? పూర్తి వివరాల్లోకి వెళితే...
అందంతో పాటు అభినయంతో రాణిస్తూ..
బాలీవుడ్లో అందంతో పాటు అభినయంతో రాణిస్తున్న హీరోయిన్లలో దీపిక పదుకొనే ఒకరు. మోడల్‌గా కెరీర్ ఆరంభించి, ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె.. ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు వ్యాపార ప్రకటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే భారీగా అర్జిస్తోంది.
స్టార్ హీరోతో ప్రేమ వివాహం
చాలా కాలంగా దీపిక బాలీవుడ్లో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. అంతకు ముందు చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ జంట.. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కింది. డెస్టినేషన్ పద్దతిలో వీరి వివాహం జరిగింది. అలాగే, రిసెప్షన్ మూడు చోట్ల ఘనంగా జరిగిన రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు, సెలెబ్రిటీలు హాజరయ్యారు.
క్రికెటర్ల తర్వాత మరో హీరోతో ప్రేమాయణం
దీపిక పదుకొనే బాలీవుడ్‌కు ప్రవేశించిన కొత్తలోనే ధోనీ, యువరాజ్ సింగ్ సహా పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించిందన్న ప్రచారం జరిగింది. అయితే, వారిలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌తో ప్రేమ చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బీ టౌన్లో జోరుగా చర్చ సాగింది. కానీ, ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయారు.
|
మాజీ లవర్ గుర్తును మాత్రం చెరపలేదు
రణబీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సమయంలో దీపిక తన మెడ వెనుక భాగంలో అతడి పేరు అర్థం వచ్చేలా ‘RK' అని టాటూ వేయించుకుంది. దానిని రణ్వీర్ సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా అలాగే ఉంచుకుంది. దీంతో ఈ టాటూ గురించి చాలా కాలం పాటు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె టాటూను తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదన్న టాక్ వినిపించింది.
ఉన్నట్లుండి మాయమైపోయింది
కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న దీపిక టాటూ ఉన్నట్లుండి మాయమైపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చప్పక్' అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమానికి హాజరైంది దీపిక. దీనికి ఆమె చీర కట్టుకుని వచ్చింది. ఆ సమయంలో టాటూ మాయమైన విషయం మీడియా గుర్తించింది. దీంతో ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది.