నా భర్తతో అవన్నీ చర్చిస్తా.. రొమాన్స్ గురించి ప్రత్యేకంగా: పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో దీపిక పదుకొనే ఒకరు. అందంతో పాటు అభినయంతో రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను అందుకుందామె. మోడల్‌గా కెరీర్ ఆరంభించి, ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె.. ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు వ్యాపార ప్రకటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే భారీగా అర్జిస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహమాడిన దీపిక.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడిలా మారింది

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడిలా మారింది

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కుమార్తెగా గుర్తింపు పొందింది దీపిక. నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగం వైపు వెళ్లిన ఈమె.. 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత షారూఖ్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.

క్రికెటర్లతో డేటింగ్ దేశ వ్యాప్తంగా హైలైట్

క్రికెటర్లతో డేటింగ్ దేశ వ్యాప్తంగా హైలైట్

హీరోయిన్‌గా పరిచయం అయిన తొలినాళ్లలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది దీపిక. ఆ సమయంలో టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో ఓ యాడ్ చేసింది. అప్పుడు అతడితో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత మరో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి హైలైట్ అయింది.

ఒక హీరోతో లవ్.. మరో స్టార్‌తో వివాహం

ఒక హీరోతో లవ్.. మరో స్టార్‌తో వివాహం

సినిమా పరిశ్రమలో రణ్‌బీర్ కపూర్‌తో చాలా కాలం పాటు ఎఫైర్ కొనసాగించింది దీపిక. అయితే, అతడికి బ్రేకప్ చెప్పేసి మరో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహమాడింది. డెస్టినేష‌న్ ప‌ద్ద‌తిలో వీరి వివాహం జ‌రిగింది. అలాగే, రిసెప్ష‌న్ మూడు చోట్ల ఘ‌నంగా జ‌రిగిన రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు, సెలెబ్రిటీలు హాజరయ్యారు. అప్పటి నుంచి ఈ జంట తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

భర్తతో కలిసి అలా.. ఇద్దరూ ఫుల్ బిజీగా

భర్తతో కలిసి అలా.. ఇద్దరూ ఫుల్ బిజీగా

వివాహం జరిగిన తర్వాత కూడా దీపిక పదుకొనే తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. మరోవైపు, రణ్‌వీర్ సింగ్ కూడా ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటించారు. ఇక, ఇప్పుడు కపిల్ దేవ్ బయోపిక్ '83'లోనూ భార్య భర్తలుగా కలిసి నటిస్తున్నారు.

పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన బాలీవుడ్ భామ

పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన బాలీవుడ్ భామ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీపిక పదుకొనే.. తాజాగా ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వాళ్లతో పంచుకుంది. అలాగే, తన భర్తతో పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను కూడా వెల్లడించింది. ఈ సమయంలోనే వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయట పెట్టింది.

Recommended Video

Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
నా భర్తతో అన్నీ చర్చిస్తా.. రొమాన్స్ గురించి

నా భర్తతో అన్నీ చర్చిస్తా.. రొమాన్స్ గురించి

లైవ్ చాట్‌లో ఓ నెటిజన్.. 'మీ సినిమాలు, క్యారెక్టర్ల గురించి రణ్‌వీర్‌తో చర్చిస్తారా' అని దీపికను ప్రశ్నించాడు. దీనికి 'అవును.. నా ప్రతి ప్రాజెక్టు గురించి అతడితో చర్చిస్తాను. మరీ ముఖ్యంగా సినిమాల్లో చేసే రొమాన్స్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. అలాగే, తన సినిమాల గురించి కూడా నాతో చర్చిస్తాడు. ఇవి కేవలం మా కెరీర్‌లో భాగం మాత్రమే' అంటూ వివరించిందీ స్టార్ హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X