'మా ఆయన బెడ్ పైకి లేటుగా'.. బోల్డ్ కామెంట్స్‌తో అందరిని నవ్వించిన దీపిక!
రణవీర్ సింగ్, దీపికా పదుకొనె బాలీవుడ్ లో క్రేజీ జంట. దీపికా, రణవీర్ గత ఏడాది నవంబర్ 14న ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీపికా, రణవీర్ గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల దీపికా, రణవీర్ సింగ్ జంటగా బ్యూటీ అవార్డ్స్ కు అతిథులుగా హాజరయ్యారు. వేదికపై దీపికా పదుకొనె తన భర్త గురించి హాట్ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

మా ఆయన లేటుగా
మీ భర్త గురించి ఏవైనా సీక్రెట్ చెప్పాలని యాంకర్ దీపికాని ప్రశ్నించింది. దీనికి దీపికా ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చింది. రణవీర్ సింగ్ స్నాయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. రెడీ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆఖరికి బెడ్ పై కూడా అని అనగానే అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. నా ఉద్దేశం పడుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు అని క్లారిటీ ఇచ్చింది.

తొలిసారి తెల్లటి దుస్తుల్లో
రణవీర్ సింగ్ మాట్లాడుతూ తాను దీపికా పదుకొనేని తొలిసారి చూసినప్పుడు ఆమె తెల్లటి దుస్తుల్లో ఉంది అని చెప్పాడు. బాగా గాలివీస్తున్న సమయంలో దీపికా నా ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో ఆమె జుట్టు గాల్లో ఎగురుతూ చాలా అందంగా కనిపించిందని రణవీర్ తెలిపాడు. దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ తొలిసారి రామ్ లీలా చిత్రంలో నటించారు. 2013లో ఈ చిత్రం విడుదలయింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

పెళ్లయ్యాక మార్పు
వివాహ జీవితం ఎలా ఉందని ప్రశ్నించగా.. పెళ్లయ్యాక తనలో చాలా మార్పు వచ్చిందని రణవీర్ తెలిపాడు. పెళ్లయ్యాక ఫ్యామిలీ మాన్ గా మారా. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నా అని తెలిపాడు. ఇటలీలోని లేక్ కొమోలో రణవీర్, దీపికా వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం తర్వాత ముంబై, బెంగుళూరు నగరాలలో వైభవంగా రిసెప్షన్ కూడా జరిగింది.

దూసుకుపోతున్న రణవీర్
సినిమాల పరంగా రణవీర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది రణవీర్ నటించిన పద్మావత్, సింబా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇటీవల విడుదలైన గల్లీ బాయ్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీపికా పదుకొనె మేఘన గుల్జార్ దర్శకత్వంలో తెరక్కెడుతున్న చపాక్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











