రణ్‌వీర్‌కు బైబై.. ఎట్టకేలకూ ఆ హీరోను పట్టేసిన దీపికా పదుకోన్!
Recommended Video

బాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలతో నటించే అవకాశం అందాల భామ దీపిక పదుకోన్‌కు దక్కింది. కానీ సల్మాన్ ఖాన్‌తో మాత్రం ఎందుకో వీలు కాలేదు. సల్మాన్, దీపికా జోడి తెరపైన కనిపిస్తే చూద్దామనుకొంటున్న అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే ఇన్షా అల్లా అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్త బాలీవుడ్ హల్‌చల్ రేపుతున్నది.

సల్మాన్, దీపికా పదుకోన్ జంటగా
బాలీవుడ్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ శ్రీకారం చుట్టబోతున్నారు. సల్మాన్, దీపికా పదుకోన్‌ను జంటగా ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2007 సంవత్సరం తర్వాత సంజయ్, సల్మాన్ కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే ప్రథమం. రణ్‌బీర్‌ను పరిచయం చేస్తూ సంజయ్ రూపొందించిన సావరియా చిత్రంలో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే.

మరోసారి భన్సాలీతో దీపికా పదుకోన్
ఇక దీపికా, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో సెన్సేషనల్ మూవీస్ వచ్చాయి. వారి కాంబినేషన్‌లో వచ్చిన రామ్ లీలా, బాజీరావు మస్తాని, పద్మావతి చిత్రాలు బాలీవుడ్ వద్ద రికార్డు కలెక్షన్లను సాధించాయి. మళ్లీ ఇన్షా అల్లాలో దీపికతో మ్యాజిక్ చేయడానికి భన్సాలీ సిద్ధమవుతున్నారు. ఈ సారి రణ్‌వీర్, దీపికా జంటను విడదీయడం చర్చనీయాంశమైంది.

ఇన్షా అల్లా టైటిల్ రిజిస్టర్
ఇన్షా అల్లా అనే టైటిల్‌ను ఇటీవల ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వద్ద సంజయ్ ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేసింది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ భాగస్వామ్యంతో సంజయ్ రూపొందించనున్నట్టు సమాచారం. అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఈ చిత్ర వివరాలను యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది.

2020 రంజాన్‌కు రిలీజ్
ఇన్షా అల్లా చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయట. మరో ఆరు నెలల్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లుందని బాలీవుడ్ మీడియా సమాచారం. భారత్ చిత్రం తర్వాత సల్మాన్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారనేది తాజా సమాచారం. ఈ చిత్రం 2020 రంజాన్‌కు రిలీజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











