నేను క్షేమంగా ఉన్నాను, వారి కోసం ప్రార్థించండి: దీపిక పదుకోన్

ముంబైలో దీపిక పదుకోన్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ బీమాండి టవర్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో దీపిక అభిమానులు ఆమెకు ఏమైనా అయిందేమో అనే ఆందోళన చెందారు. ట్విట్టర్ ద్వారా దీపిక క్షేమం ఉందని భావిస్తున్నాం అంటూ సందేశాలు పోస్టు చేశారు.
ఈ అగ్ని ప్రమాదంపై దీపిక రియాక్ట్ అయ్యారు. 'నేను క్షేమంగానే ఉన్నాను. నా క్షేమం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్థించండి' అని దీపికా ట్వీట్ చేశారు.
బీమాండి టవర్స్‌లో దీపికతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. భవనం 33వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. అగ్ని ప్రమాదం కారణంగాపై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవిచంలేదు.
అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఆ భవనంలో నివాసం ఉంటున్న వారందరినీ అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 10 ఫైరింజన్లు, జంబో ట్యాంకర్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.


Click it and Unblock the Notifications











