పెళ్ళికి రెడీ అవుతున్న దీపిక పదుకొనె.. మాజీ ప్రియుడు ఏం చేస్తున్నాడో తెలుసా!
Recommended Video

బాలీవడ్ అందాల తార దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ వివాహం మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 15న వైభవంగా వివాహ వేడుక జరగబోతోంది. దీపిక పదుకొనె కెరీర్ ఆరంభం నుంచి చాలా మందితో ప్రేమ వ్యవహారాలు సాగించింది. అందులో నీహార్ పాండ్య కూడా ఒకడు. దీపికా వివాహం జరగబోతుండగా నీహార్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నాలుగేళ్ళ నుంచి
దీపికా మాజీ ప్రియుడు నీహార్ పాండ్య, ప్రముఖ సింగర్ నీతి మోహన్ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీపికా వివాహం చేసుకుంటున్న ఈ సమయంలోనే ఆమె మాజీ ప్రియుడు కూడా పెళ్లి బాజాలు మోగించడం ఆసక్తిగా మారుతోంది.

కంగన రనౌత్ చిత్రంలో
మోడల్ గా బిజీగా ఉన్న నీహార్ పాండ్య ఇటీవల కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మణికర్ణిక చిత్రం విడుదల కాగానే నీహార్ పాండ్య, నీతి మోహన్ వివాహం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.

మూడేళ్లపాటు దీపికతో
దీపికా పదుకొనె, నీహార్ పాండ్య ఒకే యాక్టింగ్ స్కూల్ కు చెందిన వారు. ఆ సమయంలో వీరిద్దరూ మూడేళ్లపాటు సహజీవనం చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. దీపికా హీరోయిన్ గా బిజీ అయ్యాక వీరిద్దరూ విడిపోయారు.

ఇటలీలో వివాహం
నీహార్ వివాహం ముంబైలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీపికా, రణవీర్ సింగ్ ఇటలీలోని ఫేమస్ మ్యారేజ్ డెస్టినేషన్ కోమో సరస్సులో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే సోనమ్ కపూర్ వివాహం జరిగింది. దీపికా పదుకొనె, ప్రియాంక వంటి పెద్ద సెలెబ్రిటీలు పెళ్ళికి సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











