Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దీపికకు మరో హాలీవుడ్ ఛాన్స్... లుంగీ డాన్స్‌తో రచ్చ రచ్చ!
Recommended Video
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరో హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. 2017లో విన్ డీజెల్ హీరోగా వచ్చిన హాలీవుడ్ మూవీ 'XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' చిత్రంలో నటించిన ఈ బెంగుళూరు బ్యూటీ త్వరలో రాబోతున్న మరో XXX సీక్వెల్లో కూడా నటించబోతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకుడు డిజె కరుసో గతంలోనే ప్రకటన చేశారు. తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సారి తన చిత్రంలో బాలీవుడ్ పాపులర్ లుంగిడాన్స్ కూడా పెట్టబోతున్నాడట.
లుంగీ డాన్స్
షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీలో లుంగీ డాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్య ‘XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' ప్రమోషన్లో భాగంగా ఇండియాకు వచ్చిన విన్ డీజిల్‌తో కూడా దీపిక ఈ డాన్స్ చేయించింది.
ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దర్శకుడు
దర్శకుడు డిజె కరుసో తన తాజా ట్వీట్లో.... తను తీయబోయే xxx4 సినిమాను లుంగీ డాన్స్ సాంగ్‌తో ముగించబోతున్నట్లు తెలిపారు. ఆయన ట్వీట్ బట్టి సినిమా చివర్లో లుంగీ డాన్స్ సీన్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిరాశ పరిచిన దీపిక తొలి చిత్రం
‘XXX-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' చిత్రంలో దీపిక పదుకోన్ తన పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఇండియాలో కూడా ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ సినిమా షూటింగ్ కోసం చాలా బాలీవుడ్ అవకాశాలను దూరం చేసుకుంది కూడా.
దీపిక పదుకోన్ నెక్ట్స్ ఏమిటి?
‘పద్మావత్' సినిమా తర్వాత దీపిక ఏ సినిమాకు కమిట్ కాలేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ఏ సినిమాలకు కమిట్ కావడం లేదని కొందరంటున్నారు. తాజాగా హాలీవుడ్ మూవీ ఇష్యూ తెరపైకి రావడంతో ఆ సినిమా కోసమే మళ్లీ దీపిక బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉండబోతోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.