Deepika Padukone అతడితో బ్రేకప్ తర్వాత అలా కమిట్.. రణ్‌వీర్‌తో కార్‌వాన్‌లో ఆ పనులు.. దీపిక పదుకోన్
బాలీవుడ్‌లో అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ 8 సీజన్ క్రేజీగా ప్రారంభమైంది. ఈ షోలో గెస్టులుగా వచ్చిన దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ జీవితం, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. ఓ దశలో బ్రేకప్‌తో మానసికంగా కుంగిపోయిన సమయంలో రణ్‌వీర్ సింగ్ తన జీవితంలోకి ప్రవేశించాడు అంటూ చాలా విషయాలు వెల్లడించింది. దీపిక పదుకోన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
రామ్ లీలా షూటింగులో కలుసుకోవడానికి ముందు రణ్‌వీర్ సింగ్ లాంగ్ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో నేను కొన్ని కష్టమైన రిలేషన్‌షిప్స్ నుంచి బయటకు వచ్చాను. ఆ సమయంలో ఎవరితో డేటింగ్ చేయవద్దని, అఫైర్ కొనసాగించవద్దనే ఫీలింగ్‌లో ఉన్నాను. నేను ఎవరితో కలిసి ఉండకుండా సింగిల్‌గా ఉండాలని నిర్ణయం తీసుకొన్నాను అని దీపిక పదుకోన్ చెప్పారు.

కొన్ని బ్రేకప్స్ తర్వాత సింగిల్ ఉంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని అనుకొన్నాను. ఎవరితో కమిట్ కాకూడదని అనుకొన్నాను. నా వయసుకు తగినట్టుగా జీవితంలోకి ఫన్ తీసుకు రావాలని అనుకొన్నాను. అయితే నేను చాలా మందిని కలిశాను. చాలా మందితో క్లోజ్‌గా ఉన్నప్పటికి.. నా మైండ్‌లో రణ్‌వీర్ మాత్రమే నాకు తగినవాడు అనే ఫీలింగ్ ఉండేది అని దీపిక పదుకోన్ చెప్పారు.
రామ్ లీలా షూటింగ్‌లో మేమిద్దరం కలిసి ఉండేవాళ్లం. కార్‌వాన్‌లో కలిసి ఉండేవాళ్లం. కార్‌వాన్‌లోనే కలిసి భోజనం చేసే వాళ్లం. నేను ఆయన ఒడిలో కూర్చుని ఉండేదానిని. మా ఇద్దరిని ఎవరూ కూడా విడదీయలేరు అనే గాఢంగా కలిసి మెలిసి ఉండేవాళ్లం అని దీపిక చెప్పారు.

జీవితంలో అన్ని సరిగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. చాలా మంది మ్యారేజ్, రిలేషన్స్‌షిప్స్ కోసం పరుగులు పెడుతున్నారు. జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ధ్యాస తప్ప.. నిజమైన ప్రేమ గుర్తించడం లేదు. దాంతో అలాంటి చాలా మంది ఇబ్బందులు, సమస్యలు పడుతున్నారు. నిజమైన ప్రేమ, రిలేషన్ గుర్తించిన తర్వాతే జీవితంలో ముందుకు వెళ్లాలి అని దీపిక పదుకోన్ చెప్పారు.
యాక్టర్లైనా, ఎవరైనా సరే మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మ్యారేజ్ రిలేషన్ ముందుకు కొనసాగుతున్నది. ప్రతీ కాపురంలో గొడవలు, అలకలు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోని అభిప్రాయ భేదాలను పరిష్కరించుకొంటే సంసారం ఫలవంతమవుతుంది. యాక్టర్లైనా, సాధారణ ప్రజలైనా జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోవాల్సిందే అని దీపిక పదుకోన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











