For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్త ఎదుటే పాత అఫైర్‌పై దీపిక షాకింగ్ కామెంట్స్.. మరో హీరోయిన్ ఆగ్రహం.!

  By Manoj
  |

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంలో, అభినయంలో తనదైన శైలిని ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఒక వైపు సినిమాలు.. మరోవైపు యండార్స్‌మెంట్లతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బాలీవుడ్ భామ. సినిమాలు చేసినా చేయకున్నా నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే దీపిక తాజాగా చేసిన పనికి బీ టౌన్ మొత్తం షాక్ అయిపోతుంది. ఇంతకీ ఆమె ఏం చేసింది..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  రణ్‌వీర్‌తో వివాహం

  రణ్‌వీర్‌తో వివాహం

  దీపిక పదుకొనే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కొద్దిరోజుల పాటు ప్రేమాయణ సాగించిన ఈ జంట.. అగ్ని సాక్షిగా ఒక్కటైంది. డెస్టినేష‌న్ ప‌ద్ద‌తిలో వీరి వివాహం జ‌ర‌గ‌గా, రిసెప్ష‌న్ మూడు చోట్ల ఘ‌నంగా జ‌రిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలెబ్రిటీలు హాజరయ్యారు.

  రణ్‌బీర్‌తో ప్రేమాయణం

  రణ్‌బీర్‌తో ప్రేమాయణం

  దీపికా ప‌దుకొనే కొన్నాళ్ళు చాక్లెట్ బాయ్ ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట గురించి దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇద్దరూ కలిసి ఎన్నో సార్లు మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని రీతిలో దీపిక అతడికి బ్రేకప్ చెప్పేసింది.

  మాజీ లవర్ గుర్తు అలాగే ఉంచుకుంది

  మాజీ లవర్ గుర్తు అలాగే ఉంచుకుంది

  రణ్‌బీర్‌కు బ్రేకప్ చెప్పి, రణ్‌వీర్‌తో ప్రేమాయణం సాగించింది దీపిక. వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లింది. అయితే, ఆమె మాత్రం మాజీ లవర్ గుర్తులను మాత్రం అలాగే ఉంచుకుంది. వీరి ప్రేమ‌కి గుర్తుగా దీపికా త‌న మెడ‌పై ఆర్కే (ర‌ణ‌బీర్ క‌పూర్‌) అనే టాటూ వేయించుకుంది. వీరి మ‌ధ్య రిలేష‌న్‌కి బ్రేక్ ప‌డ‌డంతో ఆ టాటూని చెరిపేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన అది కుద‌ర‌లేదు.

  పాత ఎఫైర్‌పై షాకింగ్ కామెంట్స్

  పాత ఎఫైర్‌పై షాకింగ్ కామెంట్స్

  ఇటీవల ప్రముఖ క్రిటిక్ అనుపమ చోప్రా స్టార్లకు పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికే మన హీరో విజయ్ దేవరకొండ కూడా వెళ్లాడు. ఈ కార్యక్రమంలో ‘నేను రణ్‌బీర్‌ను ప్రేమించా.. కానీ, ఇప్పుడు రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు రణ్‌బీర్.. ఆలియాను పెళ్లి చేసుకుంటున్నాడు' అని దీపిక పాత ఎఫైర్‌పై మాట్లాడిందట. దీంతో అక్కడున్న వారంతా షాకైపోయారని ప్రచారం జరుగుతోంది.

  #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
  దీపికపై ఆలియా ఆగ్రహం

  దీపికపై ఆలియా ఆగ్రహం

  ఇదే సమయంలో తమ పెళ్లి ప్రస్తావన తెచ్చినందుకు ఆలియా భట్.. దీపిక పదుకొనేపై ఆగ్రహం వ్యక్తం చేసిందని బీ టౌన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అప్పటి వరకు సరదాగా సాగుతున్న పార్టీ కాస్తా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  English summary
  Deepika Padukone and Alia Bhatt recently flaunted their amazing camaraderie at a chat show where a lot more than basic info was spilled. During the course of the show, Deepika inadvertently told the whole country that Bollywood's cutest rumoured couple Ranbir Kapoor and Alia are getting married.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X