»   » వెడ్డింగ్ జ్యువెల్లరీ కొన్న దీపిక పదుకోన్.... రణవీర్‌తో పెళ్లి కోసమేనా?

వెడ్డింగ్ జ్యువెల్లరీ కొన్న దీపిక పదుకోన్.... రణవీర్‌తో పెళ్లి కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ranveer Singh And Deepika Padukone Following Virat & Anushka

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ కొన్ని రోజులుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

వెడ్డింగ్ జ్యువెలరీ కొన్న దీపిక

వెడ్డింగ్ జ్యువెలరీ కొన్న దీపిక

తన సొంత నగరమైన బెంగుళూరు వచ్చిన దీపిక ఇటీవల తన తల్లితో కలిసి భారీ ఎత్తున వెడ్డింగ్ జ్యువెల్లరీ కొనుగోలు చేసిందట. దీంతో త్వరలోనే దీపిక వివాహం ఉండబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఆ ఖాళీ సమయాన్ని ఇలా...

ఆ ఖాళీ సమయాన్ని ఇలా...

దీపిక పదుకోన్ ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు. అయితే ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధిభారిన పడి లండన్లో చికిత్స తీసుకుంటుండటంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న దీపిక పదుకోన్.... బెంగళూరు వచ్చి పెళ్లి షాపింగ్ ప్రారంభించిందని టాక్.

అదే అతిపెద్ద పని

అదే అతిపెద్ద పని

ఈ రోజుల్లో పెళ్లి తంతులో అతిపెద్ద పని అంటే వెడ్డింగ్ షాపింగ్. తన బిజీ షెడ్యూల్ వల్ల తర్వాత సమయం ఉంటుందో? లేదో? అని భావించిన దీపిక ఇలా పెళ్లికి సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో పడింది.

బెంగుళూరులో రిసెప్షన్ పార్టీ

బెంగుళూరులో రిసెప్షన్ పార్టీ

బెంగుళూరులోని ప్రముఖ నగల దుకాణాలను తన తల్లి, చెల్లి అనిషా పదుకోన్‌తో కలిసి దీపిక సందర్శించి భారీ ఎత్తున కోనుగోళ్లు జరిపారట. కాగా... పెళ్లి తర్వాత బెంగుళూరులో రిసెప్షన్ పార్టీ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట.

రహస్యంగానే మెయింటేన్ చేస్తున్నారు

రహస్యంగానే మెయింటేన్ చేస్తున్నారు

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ తమ రిలేషన్ షిప్ గురించి ఇంకా గోప్యత మెయింటేన్ చేస్తూనే ఉన్నారు. వీరి పెళ్లి కూడా ప్రైవేట్ సెర్మనీగా రహస్యంగా జరిగే అవకాశం ఉందని, కోహ్లి-అనుష్క వివాహం తరహాలోనే.... పెళ్లి తర్వాత ఫోటోలు విడుదల చేసి మీడియాకు విషయం తెలియజేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందా?

పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందా?

కొన్ని రోజుల క్రితం దీపిక పేరెంట్స్ ముంబై వచ్చారు. అక్కడే రణవీర్ కుటుంబ సభ్యులతో కలిసి వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

దీపిక ఇంట్లో మీటింగ్

దీపిక ఇంట్లో మీటింగ్

ఇటీవల ముంబైలోని దీపిక నివాసంలో.... దీపిక పేరెంట్స్, రణవీర్ పేరెంట్స్ కలుసుకున్నారని, అంతా కలిసి డిన్నర్ చేసినట్లు వార్తలు వనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బట్టి చూస్తే త్వరలోనే అభిమానులు వీరి పెళ్లి వేడుక చూడబోతున్నారని స్పష్టమవుతోంది.

English summary
After the grand wedding of Anushka Sharma and Virat Kohli, fans have been waiting to see Ranveer Singh and Deepika Padukone married. And if recent reports are to be believed, Deepika Padukone has already started shopping for her wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X