ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ : దీపికా పదుకొణె ప్రెగ్నెంటా?.. ఆ పిక్ షేర్ చేయడంతో డైలామాలో నెటిజన్స్
బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకొణె రణ్‌వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి దాంపత్య జీవితం ఎంత ముచ్చటగా ఉంటుందో అందరికీ తెలిసిందే. భార్యపై అమితమైన ప్రేమను చూపిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రణ్‌వీర్ సింగ్. భార్య చెప్పులను, కొంగును పట్టుకుని తిరుగుతూ ఎన్నోసార్లు కెమెరాకంట పడ్డాడీ హీరో. భార్య అంటే ఎంత ప్రేమో అంటూ అమ్మాయిలంతా రణ్‌వీర్ ఫ్యాన్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే దీపికా షేర్ చేసిన ఓ పిక్ ఎన్నో అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఆ ఫోటో ఏంటి? అసలు సంగతేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

విధి కలిపిన జంట..
మొదటగా రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె గాఢంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి వ్యవహారం బీటౌన్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే విధి ఆడిన వింత నాటకంలో రణ్‌బీర్ కపూర్, దీపికాలు విడిపోయారు. రణ్‌వీర్ సింగ్ లైన్‌లోకి వచ్చాడు. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి.. వివాహబంధంతో ఒక్కటయ్యారు.

నాటి బ్రేకప్‌పై స్పందిస్తూ..
రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ సంగతిని చెబుతూ.. అతనికి రెండో అవకాశం ఇవ్వడమే తన తప్పని, బతిమిలాడుకోవడం, అడుక్కోవడంతో ఇచ్చానని, అయితే అప్పటికే అందరూ చెబుతున్నారని అయినా తాను విలేదని చెప్పింది. ఒకసారి తానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, అప్పటి నుంచి రిలేషన్ షిప్‌క్ స్వస్తి పలికానని పేర్కొంది.
అన్యోన్య దాంపత్యం..
అలా అక్కడ విడిపోవడంతో దీపిక-రణ్‌వీర్‌లు కలిశారు. ఆమెతో చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని దీపికాయే తన అదృష్ట దేవత అని చెబుతుంటాడు రణ్‌వీర్. అందుకే దీపికాను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ఏదైనా ఈవెంట్లో వీరిద్దరూ పాల్గొన్నారంటే.. అందరి కళ్లు అటువైపు తిరగాల్సిందే.

మామిడి కాయలు తింటూ..
తాజాగా దీపికా షేర్ చేసిన ఓ ఫోటోను చూసిన నెటిజన్స్‌కు ఎన్నో అనుమానాలు తలెత్తాయి. మామిడి కాయ ముక్కలను కోసి ఉప్పుకారం చల్లి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక దీంతో నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏంటి ఏదైనా శభవార్తా? మామిడికాయలు తింటున్నావ్? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











