దీపికా పదుకొనేని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. మాజీ ప్రియుడి ఫొటో తెచ్చిన తంటా!

రొమాంటిక్ బాయ్ రణబీర్ కపూర్ ప్రేమ కలాపాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతగాడి జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం రణబీర్ కపూర్ రొమాంటిక్ వలలో చిక్కుకున్నవారే. అప్పట్లో దీపికా, రణబీర్ కపూర్ రొమాన్స్ హాట్ హాట్ గా సాగింది. విభేదాలు తలెత్తడంతో చాలా కాలం క్రితమే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం దీపికా స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ త్వరలో వివాహానికి కూడా వీరిద్దరూ సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దీపికా అనవసరంగా నెటిజన్ల చేతిలో చిక్కింది.

వయ్యారంగా నిలబడి

వయ్యారంగా నిలబడి

దీపికా పదుకొనె వయ్యారంగా నిలబడి దూరంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీస్తోంది. కొండలు గుట్టలు, సూర్యాస్తమయ సమయంతో ఈ ఫోటో చాలా అందంగా ఉంది. కానీ దీపికా పదుకొనె ఫోటో తీస్తున్నది మరెవరినో కాదు.. తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ని. ఈఫోటోనే దీపికకు అనవసరమైన చిక్కులు తెచ్చిపెట్టింది.

క్రొయేషియా

2015 లో దీపికా, రణబీర్ నటించిన తమాషా చిత్రం తెరకెక్కింది. ఏ చిత్ర షూటింగ్ లో భాగంగా దీపికా, రణబీర్ క్రొయేషియా వెళ్లారు. అక్కడ క్లిక్ మనిపించిందే ఈ ఫోటో. ఆదివారం రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా దీపికా ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

నెటిజన్ల విమర్శలు

నెటిజన్ల విమర్శలు

మరి కొన్ని రోజుల్లో రణవీర్ సింగ్ ని వివాహం చేసుకోబోతూ ఇవేం పనులు అని దీపికని ఏకిపారేస్తున్నారు. తీవ్రమైన కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. దీపికా, రణబీర్ విడిపోయి చాలా కాలం అవుతోంది. అలాంటి సమయంలో ఇప్పడు ఎందుకు అతడి ఫోటో షేర్ చేసింది అని చర్చించుకుంటున్నారు.

మరచిపోలేదా

మరచిపోలేదా

మాజీ ప్రియుడిని ఇంకా మరచిపోలేదా, గతాన్ని తవ్వుకుంటే నీ జీవితం కూడా తమాషా అవుద్ది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరైతే రణబీర్ ని మరచిపోలేకున్నావా, రణవీర్ అంటే ఇష్టం లేదా అంటూ దీపికపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X