twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోకు హీరోయిన్ వార్నింగ్! వస్తే వాటితోనే రా.. అంటూ సోషల్ మీడియా పోస్ట్

    |

    బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ ఇద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ తమ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో అదే సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా భర్త రణ్‌వీర్ సింగ్‌‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచింది దీపికా పడుకొనే.

    2018 సంవత్సరం పెళ్లి చేసుకొని ఒక్కటైన రణ్‌వీర్ సింగ్‌, దీపిక జోడీ 83 చిత్రంలో తొలిసారి దంప‌తులుగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మేరకు సినిమా ప్ర‌మోష‌న్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా చెన్నై వెళ్లిన రణ్‌వీర్ సింగ్‌ 83 సినిమాకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసి అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.

     Deepika Padukone sheres her Demands with Ranveer Singh

    అయితే ఇదే పోస్ట్‌పై రణ్‌వీర్ సింగ్‌ దీపిక పడుకొనే స్పందిస్తూ ఏకంగా వార్నింగ్ ఇచ్చేసింది. ''చెన్నై నుంచి వచ్చేట‌ప్పుడు కిలో మైసూర్‌పాక్‌, అర‌కిలో ఆలు చిప్స్ ప‌ట్టుకురండి. ఇవి లేకుండా మాత్రం ఇంటికి రావొద్దు'' అంటూ ఓ షాపింగ్ లిస్టు ఇచ్చింది. ఇన్‌స్టాలో పడుకొనే ఇలా భ‌ర్త‌కు ఆర్డ‌ర్ వేయ‌డం చూసిన డైరెక్ట‌ర్ క‌బీర్‌ఖాన్ భార్య కూడా దీపిక చెప్పిన లిస్టులోని వ‌స్తువుల‌నే ఇంటికి తీసుకు రమ్మని ఆర్డర్ చేసింది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

    ఇక 83 సినిమా విషయానికొస్తే.. 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. తెలుగులో '83' చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విడుద‌ల చేస్తున్నాయి.

    English summary
    Ranveer and Deepika will be reuniting on the screen in '83. The 33-year-old star will play Romi Dev, wife to cricketing legend Kapil Dev, to be played by Ranveer. Now Ordered Ranveer as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X