Deepika Padukone బికినీ ఫోటో లీక్.. పఠాన్ షూటింగులో షారుక్‌తో కలిసి ఘాటుగా..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్ర షూటింగు స్పెయిన్‌లో నిరాటకంగా సాగుతున్నది. అయితే పలు మార్లు వాయిదా పడి తిరిగి ఇటీవలే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే స్పెయిన్‌లో కొనసాగుతున్న షూటింగులో బికినీలో ఉన్న దీపిక పదుకోన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆర్యన్ డ్రగ్స్ కేసు కారణంగా

ఆర్యన్ డ్రగ్స్ కేసు కారణంగా


వాస్తవానికి గత మూడు నెలల క్రితమే పఠాన్ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో మొదలవ్వాల్సింది. కానీ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ప్రయత్నించడం, ఆ వివాదం నుంచి బయటపడటానికి ఎక్కువ రోజులే తీసుకొన్నాడు.

స్పెయిన్‌లో పఠాన్ షూటింగ్‌లో

స్పెయిన్‌లో పఠాన్ షూటింగ్‌లో


ఆర్యన్ ఖాన్ కేసును ఓ కొలిక్కి తీసుకు రావడానికి షారుక్ ఖాన్ కాస్త సమయం తీసుకొన్నాడు. ఈ కేసులో తన కుమారుడు సేఫ్ అనుకొన్న తర్వాత ఇటీవల స్పెయిన్‌లో షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్‌లో షారుక్, దీపిక పదుకోన్‌కు సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షారుక్ ఖాన్ అర్ధనగ్నంగా ఉండి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది.

దీపిక పదుకోన్ అందాల ఆరబోత

దీపిక పదుకోన్ అందాల ఆరబోత


ఇక దీపిక పదుకోన్ షూటింగులో అందాల ఆరబోత మరో లెవెల్‌లో కనిపించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద పసుపు పచ్చని బికినీలో మరింత గ్లామరస్‌గా కనిపించింది. బికినీలో ఉన్న దీపిక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అబిమానులు దీపిక అందాలను చూస్తూ ఫిదా అవుతున్నారు.

 8 ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్‌తో

8 ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్‌తో


పఠాన్ సినిమా కోసం షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ మరోసారి 8 ఏళ్ల తర్వాత జతకట్టారు. గతంలో షారుక్‌తో దీపిక ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించింది. మళ్లీ మరోసారి అద్భుతమైన కెమిస్ట్రీని వెండితెరపై పండించేందుకు ఈ జంట సిద్దమవుతున్నారు.

Recommended Video

Deepika Padukone Visits Lalbaugcha Raja's Pandal in Mumbai | Filmibeat Telugu
పఠాన్ రిలీజ్ ఎప్పుడంటే?

పఠాన్ రిలీజ్ ఎప్పుడంటే?


దీపిక, షారుక్ జంటగా రూపొందుతున్న పఠాన్ చిత్రం 2023లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాకు సిద్దార్త్ ఆనంద్ దర్శకుడు. ఇటీవల హృతిక్, టైగర్ ష్రాఫ్‌తో వార్ అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2023, జనవరి 25వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X