సక్సెస్, సంపాదన లేవు.. కానీ ఆ ఒక్క కారణంగానే అతడిని పెళ్లి చేసుకొన్నా.. దీపిక పదుకోన్ హాట్ కామెంట్స్

బాలీవుడ్‌లో స్టార్ కపుల్ దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకొని ఒక్కటయ్యారు. అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్‌తో ఎందుకు ప్రేమలో పడాల్సి వచ్చింది? ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రణ్‌వీర్ గురించి దీపిక చెప్పిన విషయాలు ఇవే...

రామ్ లీలా షూటింగులో

రామ్ లీలా షూటింగులో

సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే రామ్ లీలా సినిమా కంటే ముందే నేను రణ్‌వీర్ సింగ్‌ను ఇష్టపడ్డాను. అయితే రామ్ లీలా సమయంలో మా మధ్య బంధం మరింత బలంగా మారింది. అప్పుడే రణ్‌వీర్ సింగ్ నాకు సరైన జోడి అనే అభిప్రాయం కలిగింది అని దీపిక పదుకోన్ చెప్పారు.

రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లి ఎందుకంటే

రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లి ఎందుకంటే

నేను రణ్‌వీర్ సింగ్‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నానంటే.. రణ్‌వీర్ కంటే ఎక్కువ సక్సెస్‌ను సొంతం చేసుకొన్నాను. ఆయన నా సక్సెస్, నా సంపాదనను ఎక్కువగా గౌరవించేవాడు. ఆ విషయంలో నేను ఎమోషనల్‌గా లొంగిపోయాను. ఏడేళ్ల క్రితం రణ్‌వీర్ కంటే నాకే ఎక్కువ పాపులారిటీ, సక్సెస్ ఉండేది అని దీపిక చెప్పింది.

నా కంటే రణ్‌వీర్ బిగ్ స్టార్

నా కంటే రణ్‌వీర్ బిగ్ స్టార్

ప్రస్తుత పరిస్థితుల్లో నా కంటే రణ్‌వీర్ ఎక్కువగా బిజీ. నా కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. నా కంటే పెద్ద స్టార్. అయితే మా మధ్య ఇలాంటి విషయాలు పెద్దగా చర్చకు రావు. సక్సెస్, సంపాదన మా ప్రేమకు, పెళ్లికి, రిలేషన్‌షిప్‌కు అడ్డంకిగా మారలేదు అని దీపిక పదుకోన్ పేర్కొన్నారు.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం అదే

నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం అదే

రణ్‌వీర్‌ సింగ్ పెళ్లి చేసుకోవాలని తీసుకొన్న నిర్ణయం నా జీవితంలో ది బెస్ట్. నేను ఏదైనా సమస్యల్లో ఉంటే నాకు అండగా నిలిచాడు. ఎలాంటి సమయంలో మానసికంగా నాకు ధైర్యాన్ని ఇస్తాడు. అతడి కంటే నా జీవితంలో గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు అని దీపిక పదుకోన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X