దీపికా పదుకొనె గర్భవతా.. భార్యలని అలా బలవంత పెట్టొద్దు, ఎప్పుడు జరగాలో అప్పుడే!

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గత ఏడాది తన ప్రియుడు రణవీర్ సింగ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 నవంబర్ లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దీపిక వివాహం తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అందంతో, అభినయంతో దీపికా తన క్రేజ్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్లగలిగింది. ఇటీవల కొన్ని రోజుల నుంచి దీపికా గర్భవతి అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలపై దీపికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 ఆరేళ్ళ సహజీవనం

ఆరేళ్ళ సహజీవనం

దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ జంట దాదాపు ఆరేళ్ళు సహజీవనం అనంతరం గత ఏడాది నవంబర్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగి దాదాపు ఐదు నెలలు గడుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో దీపికా పదుకొనె గర్భవతి అయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై దీపికా కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో ఈ వార్తలు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా దీపికా పదుకొనె స్వయంగా ఆ వార్తలని ఖండించింది.

 ఎప్పుడు జరగాలో అప్పుడే

ఎప్పుడు జరగాలో అప్పుడే

తాను గర్భవతిని అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని దీపికా తెలిపింది. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత తల్లి కావాలని అందరూ కోరుకుంటారు. నాకు పెళ్లయింది కాబట్టి తల్లిని కాబోతున్నానంటూ ఊహాగానాలు సృష్టిస్తున్నారు అని దీపికా పేర్కొంది. నిజంగా అది జరిగిన రోజు అందరికి తెలుస్తుంది కదా అని దీపికా పేర్కొంది.

 బలవంత పెట్టొద్దు

బలవంత పెట్టొద్దు

అందరికి తల్లి కావాలనే కోరిక ఉంటుంది. కానీ పెళ్ళైన వెంటనే పిల్లలని కనాలనే రూల్ లేదు. ఆ విషయంలో భర్తలు భార్యలని బలవంత పెట్టడం సరైంది కాదు. కొంత కాలం ఆగక కూడా పిల్లలని కనవచ్చు అంటూ దీపికా పదుకొనె పేర్కొంది. మనం సమాజంలో మార్పు తీసుకువచ్చినప్పుడు మహిళలపై ఇలాంటి ఒత్తిడులు తగ్గుతాయని దీపికా పేర్కొంది.

 తొలిసారి

తొలిసారి

ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా పదుకొనె తొలిసారి సాహసోపేతమైన చిత్రంలో నటిస్తోంది. యాసిడ్ దాడికి గురై జీవితంలో తట్టుకుని నిలబడిన లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా చపాక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహిళా దర్శకురాలు మేఘన గుల్జార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. దీపికా ఇటీవల ఈ చిత్రంలో తన లుక్ ని బయట పెట్టిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X