పెళ్లి సందడి షురూ: ఏకం కాబోతున్న బాలీవుడ్ స్టార్ లవర్స్, మొదటి ఘట్టం..(ఫోటోస్)
రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. రెండు వారాల ముందే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని దీపిక పదుకోన్ నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంతో పెళ్లి వేడుక మొదలైనట్లయింది.
వధువు దీపిక పదుకోన్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక మొదలవ్వడానికి ముందు నంది పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివాహ వేడుకలో మొదటి ఘట్టం
దీపిక పదుకోన్ కుటుంబంలో వివాహానికి ముందు నంది పూజ నిర్వహించడం మొదటి ఘట్టంగా భావిస్తున్నారు. దీపిక పదుకోన్ స్టైలిస్ట్ షాలీనా నాథని, ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

నవంబర్ 14, 15
దీపిక పదుకోన్ బెంగుళూరు అమ్మాయి కావడంతో సౌత్ సాంప్రదాయం ప్రకారం.... రణవీర్ సింగ్ మహారాష్ట్ర సింధి వంశానికి చెందిన వ్యక్తి కావడంతో వారి సాంప్రదాయం ప్రకారం వేర్వేరుగా పెళ్లి వేడుక జరుగనుందని తెలుస్తోంది.

వివాహ వేదిక
ఇటలీలోని లేక్ కోమో వీరి వివాహ వేడుకక వేదిక కానుంది. ‘దెల్ బాల్బియానెల్లో' అనే విల్లాలో వీరి వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విల్లాలో వివిధ దేశాలకు చెందిన ధనవంతులు, ప్రముఖుల వివాహాలు జరిగాయి.

ఐదేళ్ల ప్రేమాయణం
2013లో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్-లాలా' చిత్రంలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు.

డిసెంబర్ 1న వెడ్డింగ్ రిసెప్షన్
ఇటలీలో జరిగే పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే డిసెంబర్ 1న ముంబైలో బాలీవుడ్ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











