హోటల్స్‌లో దీపిక పదుకోన్ అలాంటి పనులు చేసేదా? విషయం లీక్ చేసిన ఫ్రెండ్!

Recommended Video

Deepika Padukone's Friend Sneha Ramchander Reveals Secrets Of Her || Filmibeat Telugu

ఒక వ్యక్తికి సంబంధించిన రహస్యాలు వారి స్నేహితులకే తెలుస్తుంటాయి. మనం కూడా వారిపై పూర్తి నమ్మకంతో... ఆ సీక్రెట్స్ ఎప్పటికీ బయట పెట్టరు అనే భరోసాతో ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన బెస్ట్ ఫ్రెండ్సే మనకు సంబంధించిన కొన్ని విషయాలు బయట‌పెట్టి మనకు షాకిస్తుంటారు. ఇలాంటి అనుభవమే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్‌కు ఎదురైంది.

ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేసినపుడు అక్కడ ఉండే హోటల్స్‌లో బస చేస్తాం. అందులో ఉండే వస్తువులు వాడుకుని, తిరిగి అక్కడే పెట్టేస్తాం. అయితే కొందరు మాత్రం ఇలాంటి చోట తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అక్కడ ఉండే చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. దీపిక పదుకోన్ కూడా ఇలాంటి కేటగిరీకి చెందిన వ్యక్తేనంట.

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దీపికకు షాక్ ఇచ్చిన స్నేహితురాలు

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దీపికకు షాక్ ఇచ్చిన స్నేహితురాలు

ఆగస్టు 4న వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దీపిక పదుకోన్ బెస్ట్ ఫ్రెండ్ స్నేహా రాంచందర్ తన స్నేహితురాలి గురించి ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు. హోటల్స్‌ నుంచి దీపిక పదుకోన్ షాంపూ బాటిల్స్ దొంగిలించేదని, ఆమెకు ఈ అలవాటు ఉండేది అంటూ వెల్లడించారు.

దీపిక పదుకోన్ అలా ఎందుకు చేసేదంటే...

దీపిక పదుకోన్ అలా ఎందుకు చేసేదంటే...

హోటల్ గదుల్లో ఉండే షాంపూ బాటిల్స్ అందంగా ఉండేవి అని, వాటిని సేకరించడం అంటే దీపికకు చాలా ఇష్టం. అక్కడ వాటిని కొనుగోలు చేయడానికి వీలు పడదు కాబట్టి వాటిని నొక్కేసి తన బ్యాగులో పెట్టుకునేది అంటూ స్నేహా రాంచందర్ తెలిపారు.

చిన్నతనం నుంచే స్నేహితులు

చిన్నతనం నుంచే స్నేహితులు

దీపిక పదుకోన్, స్నేహా రాంచందర్ చిన్నతనం నుంచే ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు ట్రావెల్ చేశారు. ప్రస్తుతం వృత్తి పరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా ఇద్దరూ కలిసినపుడు వ్యక్తిగత విషయాల గురించే ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారట. ఇద్దరి స్నేహం ఇలాగే కొనసాగాలని ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరోసారి తన మనసులోని విషయం బయటపెట్టారు స్నేహ రాంచందర్.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

‘పద్మావత్' మూవీ తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న దీపిక... ఈ సమయం మొత్తం తన పెళ్లి ఏర్పాట్లకే కేటాయించారు. 2018 చివర్లో ఆమె తన బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఛపాక్' మూవీతో పాటు ‘83' చిత్రంలో నటిస్తోంది. 83 మూవీలో ఆమె రణవీర్ సింగ్ భార్య పాత్రలో నటిస్తుండటం విశేషం. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X