అవకాశాల కోసం.... దీపికను కూడా నీచమైన పనులు చేయమన్నారట!

By Bojja Kumar

Recommended Video

Deepika Padukone Talks About Film Industry Culture

అందరి హీరోయిన్ల మాదిరిగానే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్‌ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలినాళ్లలో అనేక ఒత్తిడులు, వేధింపులు ఎదుర్కొంది. తాజాగా లండన్ బేస్డ్ మేగజైన్ ఈవినింగ్ స్టాండర్డ్ తో ఆమె మాట్లాడుతూ పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు హాలీవుడ్లో సంచలనం రేపిన హార్వీ వెయిన్‌స్టన్ ఇష్యూ గురించి, మీటూ కాంపెయిన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు దీపిక తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

 ‘బూబ్ జాబ్' అడ్వైజ్ చేశారు

‘బూబ్ జాబ్' అడ్వైజ్ చేశారు

బాలీవుడ్ డైరెక్టర్ల దృష్టిలో పడటానికి కొంత మంది తనకు ‘బూబ్ జాబ్' అడ్వైజ్ చేశారని, మరికొందరు బ్యూటీపజెంట్ కాంటెస్టుల్లో పాల్గొన్నాలని సూచించారని, ఇలాంటి చేయడం వల్ల త్వరగా గుర్తింపు వస్తుందని కొందరు సూచించారని ఆమె తెలిపారు.

నీచమైన పనులు చేయమన్నారు

నీచమైన పనులు చేయమన్నారు

సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన కొత్తలో చాలా మంది చెత్త ఐడియాలు ఇచ్చారు, కొన్ని నీచమైన పనులు చేయాలని కోరారు. కానీ నేను అలాంటి మనిషిని కాదు, నాకు నచ్చిన దారిలోనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను అని దీపిక చెప్పుకొచ్చారు.

#మీటూ గురించి

#మీటూ గురించి

మీ టూ, టైమ్స్ అప్ కాంపెయిన్లు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఇండియాలో అనేక మార్పులు తీసుకొచ్చిందని దీపిక అభిప్రాయ పడ్డారు. చాలా మంది #మీటూ ఇష్యూ గురించి మాట్లాడారని, ఈ కాంపెయిన్ మంచి మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

‘పద్మావత్' తర్వాత దీపిక ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే త్వరలో రాబోతున్న ‘జీరో' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. దీపిక తన ప్రియుడు రణబీర్ కపూర్‌ను పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X