వెడ్డింగ్ బాష్: పార్టీలో రణవీర్ సింగ్ డాన్స్ చూసి అంతా షాక్, దీపిక కూడా...
దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ పెళ్లికి సంబంధించి వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత ఇండియా వచ్చిన ఈ బాలీవుడ్ కపుల్ రీసెంట్‌గా బెంగుళూరులో రిసెప్షన్ వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.
నవంబర్ 28, డిసెంబర్ 1న ముంబైలో సినీ ప్రముఖుల కోసం దీపిక-రణవీర్ మరో రెండు వెడ్డింగ్ రిసెప్షన్స్ నిర్వహించబోతున్నారు. ఈ గ్యాపులో రణవీర్, దీపిక తమ సన్నిహితులు ఏర్పాటు చేసిన వెడ్డింగ్ బాష్‌లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రణవీర్ సింగ్-దీపిక పదుకోన్
రణవీర్ సింగ్ సోదరి రితికా ఏర్పాటు చేసిన వెడ్డింగ్ బాష్‌లో దీప్-వీర్ డాన్స్ చేశారు. పలు బాలీవుడ్ పాటలకు స్టెప్స్ వేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకలో రణవీర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.
రణవీర్ డాన్స్ చూసి షాక్
ఈ వెడ్డింగ్ బాష్‌లో రణవీర్ గంతులేస్తూ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. అతడి వాలకం చూస్తుంటే ఎక్కువగా తాగినట్లు ఉన్నాడేమో అనే సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

డార్క్ నైట్ డ్రెస్
ఈ వెడ్డింగ్ బాష్‌లో రణవీర్ సింగ్ ధరించిన డ్రెస్ డిఫరెంటుగా ఉంది. చీకట్లో సైతం మెరిసేలా ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. మనీష్ అరోరా రణవీర్ కోసం ఈ వెడ్డింగ్ పార్టీ డ్రెస్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

రణవీర్-దీపిక
ఐదేళ్లుగా డేటింగులో మునిగితేలుతున్న రణవీర్-దీపిక నవంబర్ 14. 15 తేదీల్లో కొంకణి, సింధి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబైలో ఓ ఇల్లు కొనుగోలు చేసిన దీపిక-రణవీర్ త్వరలోనే ఆ ఇంట్లో కాపురం పెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











