దీపికా, రణవీర్ వెడ్డింగ్ రిసెప్షన్: ది లీలా ప్యాలెస్‌కు చేరుకున్న నవ దంపతులు
బాలీవుడ్ క్రేజీ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం నవంబర్ 14 న ఇటలీలోని లేక్ కొమోలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో విహరిస్తున్న దీపికా, రణవీర్ ఈ వివాహంతో అధికారికంగా ఒక్కటయ్యారు. కాగా నేడు బెంగుళూరులో వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. సినీరాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్న వెడ్డింగ్ రిసెప్షన్ కు అని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నవ దంపతులు
రిసెప్షన్ కు ఇంకా సమయం ఉండగానే దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ ముందుగానే ది లీలా ప్యాలెస్ కు చేరుకొని ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు. దీపికా పదుకొనె బ్లాక్ డ్రెస్ కనిపిస్తోంది. ఏర్పాట్లని పరిశీలించేందుకు ప్యాలెస్ మొత్తం చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ క్రికెటర్స్
వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యే అతిధుల జాబితాలో మాజీ క్రికెటర్స్ రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే కూడా ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపికా రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు 1000 మంది వరకు అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

'ఐశ్వర్య' దర్శకుడు
దీపికా పదుకొనె బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం ఓం శాంతి ఓం. కానీ ఆమె సినీరంగ ప్రవేశం చేసింది మాత్రం కన్నడ చిత్రంతో. ఇంద్రజిత్ లంకేశ్ దర్శత్వంలో దీపికా పదుకొనె ఐశ్వర్య అనే చిత్రంలో నటించింది. ఇదే దీపికకు తొలి చిత్రం. ఇంద్రజిత్ లంకేశ్ కూడా ఓ గెస్ట్ గా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

భారీ భద్రత
వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే లీలా ప్యాలెస్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వెడ్డింగ్ రిసెప్షన్ కోసం లీలా ప్యాలెస్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దీపికా పదుకొనె, రణవీర్ ఫోటో గ్రాఫర్స్ కు ఫోజులిచ్చే వేదిక ఇప్పటికే సిద్ధం అయింది. అందమైన పూలతో ప్యాలెస్ ని డెకరేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్యాలెస్ ముస్తాబవుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











