దంపతులుగా ఇండియా చేరిన దీప్-వీర్... చేతిలో అది చూసి ఆశ్చర్యం!
Recommended Video

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఇటలీలో పెళ్లి చేసుకుని ఆదివారం ముంబై చేరుకున్నారు. దంపతులుగా ఇండియాకు ఎంట్రీ ఇచ్చిన వారికి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్ కం లభించింది. ఎయిర్‌పోర్టులో తమకు ఎదురు పడ్డ అభిమానులకు అభివాదం చేస్తూ దీప్-వీర్ దంపతులు ముందుకు సాగారు.
అయితే రణవీర్ చేతిలో ఉన్న ఓ గుర్తు అందరినీ ఆకర్షించింది. అతడి కుడి చేతిలో 'దీపం' డిజైన్ మెహందీ వేసి ఉంది. దీపికపై ప్రేమను చాటుకోవడానికే రణవీర్ ఆమె పేరు గుర్తొచ్చేలా ఇలాంటి డిజైన్ వేయించుకున్నారని చర్చించుకుంటున్నారు.

వైరల్ అవుతున్న దీప్
దీపిక-రణవీర్ దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం పెద్దల అంగీకరంతో పెళ్లి చేసుకున్నారు. తాము కలలు కన్న విధంగా ఇటలీలో డెస్డినేషన్ వెడ్డింగ్ ద్వారా ఏకమయ్యారు. ఈ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి. గడిచిన వారం ఇండియన్స్ అత్యధికంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది కూడా వీరి గురించే.

పోటీ పడ్డ అభిమానులు
పెళ్లి తర్వాత తొలిసారి ఇండియా వచ్చిన దీప్-వీర్ దంపతులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. భారీ భద్రత మధ్య పోలీసులు ఎయిర్‌పోర్ట్ నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు.

దంపతులను దీవిస్తూ నినాదాలు
ఈ కొత్త దంపతులను దీవిస్తూ కొందరు అభిమానులు నినాదాలు చేశారు. మీరు కలకాలం సంతోషంగా జీవితం సాగించాలని మరికొందరు ఆకాంక్షించారు. అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి దీపిక-రణవీర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

దీపిక-రణవీర్
దీప్-వీర్ జంట రెండు రోజులు ముంబైలో గడిపి.... నవంబర్ 21న బెంగుళూరు చేరుకుంటారు. దీపిక కుటుంబం నవంబర్ 21వ తేదీన ఇక్కడి ‘ది లీలా'లో గ్రాండ్ వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేసింది. నవంబర్ 28న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో దీపిక-రణవీర్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.


Click it and Unblock the Notifications











