ముంబైలో కొత్త ఇల్లు కొన్న దీపిక-రణవీర్... ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం పెళ్లి ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలో తాము కోరుకున్న విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్న ఈ జంట ఆదివారం ముంబై చేరుకుంటున్నారు.
ముంబైలోని రణవీర్ నివాసం ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ మేరకు రణవీర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు నూతన వధూవరులకు గ్రాండ్ వెల్ కం చెప్పేందుుకు ఏర్పాట్లు చేశారు. కొందరు అభిమానులు సైతం రణవీర్ నివాసం వద్దకు చేరుకుని వారిని స్వయంగా విష్ చేయాలని వేచి చూస్తున్నారు.

కొత్త ఇల్లు కొన్నారు
అయితే పెళ్లి తర్వాత రణవీర్-దీపిక ఎక్కడ కాపురం పెడతారు అనేది హాట్ టాపిక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు జుహులో ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత వారు ఇక్కడే నివాసం ఉండబోతున్నారట.

ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
జుహులో దీప్-వీర్ కొనుగోలు చేసిన ఇల్లు ఖరీదు రూ. 50 కోట్ల ఉంటుందని అంచనా. దాంతో పాటు తమ టేస్టుకు తగిన విధంగా మరింత ఎక్కువ ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నారట. ఆ ఇల్లు సిద్ధం అయ్యే వరకు వీరు రణవీర్ నివాసంలోనే కాపురం ఉంటారని తెలుస్తోంది.

నవంబర్ 21న బెంగుళూరుకు
దీప్-వీర్ జంట ఆదివారం ముంబై చేరుకున్న తర్వాత రెండు రోజులు ఇక్కడే గడిపి.... నవంబర్ 21న బెంగుళూరు చేరుకుంటారు. దీపిక కుటుంబం నవంబర్ 21వ తేదీన ఇక్కడి ‘ది లీలా'లో గ్రాండ్ వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేసింది.

ముంబైలో గ్రాండ్ రిసెప్షన్
నవంబర్ 28న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో దీపిక-రణవీర్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు బాలీవుడ్ చిత్ర సీమకు చెందిన ప్రముఖులంతా హాజరు కాబోతున్నారు.

డిసెంబర్ నుంచి మళ్లీ బిజీ బిజీ
దీపిక, రణవీర్ డిసెంబర్ రెండో వారం నంచి మళ్లీ ఎవరి పనుల్లో వారు బిజీ కాబోతున్నారు. రణవీర్ ‘టెంపర్' హీందీ రీమేక్ ‘సింహా'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











