twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు సినిమాలను బ్యాన్ చేయలేం.. సుశాంత్ సింగ్ తండ్రికి షాకిచ్చిన ఢిల్లీ కోర్టు!

    |

    బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలపై స్టే విధించాలని సుశాంత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దాంతో సుశాంత్ తండ్రికి నిరాశే ఎదురైంది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...

    సుశాంత్ జీవిత కథ ఆధారంగా

    సుశాంత్ జీవిత కథ ఆధారంగా

    తన కుమారుడు సుశాంత్ సింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని కొందరు ప్రత్యక్షంగాను, మరికొందరు పరోక్షంగాను సినిమాలు తీస్తున్నారు. ఏదైనా సినిమా తీయాలనుకొంటే కుటుంబ సభ్యులు ఆమోదం, అనుమతితో సినిమా తీయాలి అని కృష్ణ కిషోర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ తన కుమారుడి ప్రతిష్టను, కుటుంబ పరువును కించపరిచే విధంగా సినిమాలు తీయరాదు. మా హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఆయన సూచించారు.

    స్వప్రయోజనాల కోసం అంటూ..

    స్వప్రయోజనాల కోసం అంటూ..

    సుశాంత్ సోదరి మీతూ సింగ్ ట్విట్టర్ స్పందిస్తూ.. దురదృష్టవశాత్తూ.. కొంత మంది స్వప్రయోజనాల కోసం సుశాంత్‌ను వాడుకొంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది క్షమించరాని చర్య. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారంతా అలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు

    ఢిల్లీ కోర్టులో సుశాంత్ తండ్రి పిటిషన్

    ఢిల్లీ కోర్టులో సుశాంత్ తండ్రి పిటిషన్

    ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందనట్టు భావిస్తున్న న్యాయ్: ది జస్టిస్, శశాంక్ చిత్రాలపై ఫిర్యాదు చేస్తూ ఇటీవల ఢిల్లీ కోర్టులో కృష్ణ కిషోర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని తన పిటిషన్‌లో సూచించారు. దాంతో ఆ రెండు సినిమాలపై కొంత వివాదం నెలకొన్నది.

    జస్టిస్ సంజీవ్ నరూలా తిరస్కారం

    జస్టిస్ సంజీవ్ నరూలా తిరస్కారం

    సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ నరూలా విచారించారు. అయితే తన కుమారుడు మరణాన్ని తమకు అడ్వాంటేజీగా తీసుకొని సినిమాలు తీస్తున్నారనే అభియోగంపై విచారించారు. అయితే ఆ రెండు చిత్రాలపై స్టే విధించలేమని కేకే సింగ్ పిటిషన్‌ను తిరస్కరించారు.

    మీ పిటిషన్‌ను అందుకే తిరస్కరిస్తున్నాం...

    మీ పిటిషన్‌ను అందుకే తిరస్కరిస్తున్నాం...

    కేకే సింగ్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరిస్తూ.. పబ్లిక్ డొమైన్‌లో అదివరకే కొన్ని సంఘటనలకు సంబంధించిన విషయాలు ప్రచారమైనా లేదా బహిర్గతమైనా వాటిని స్పూర్తిగా తీసుకొని సినిమాలు నిర్మించవచ్చు. కాబట్టి మీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం అని న్యాయమూర్తి సంజీవ్ నరూలా పేర్కొన్నారు.

    English summary
    Delhi High Court dismissed Sushant Singh Rajputs’s fathers petition: and refused to stay Nyay: The Justice, Shashank. Nyay: The Justice releasing on June 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X