twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా పబ్లిసిటీ పిచ్చి.. 20 లక్షలు కట్టండి.. హీరోయిన్ కి హైకోర్టు షాక్!

    |

    దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పిటిషన్ పై విచారణ జరిపిన దర్మాసనం ఆమె ఫిర్యాదు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాక ఆమెను మందలించింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 5జీ టెక్నాలజీ అనుమతించవద్దని జూహీ చావ్లా విజ్ఞప్తిని ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది.

    టెక్నాలజీ అనేది దేశంలో అప్ గ్రేడ్ కావాలని స్పష్టం చేసింది. అలాగే కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ నటి సహా ఈ అంశంలో కోర్టు మెట్లెక్కిన అందరికీ రూ. 20 లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆమె అభిమాని పాటలు పాడడం అందుకు సంబంధించిన వీడియోను నటి సోషల్ మీడియాలో షేర్ చేయడం గురించి కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ అంశం మీద కోర్టును ఆశ్రయించడానికి ముందే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది.

     Delhi High Court dismisses Juhi Chawlas case against 5G

    నిజానికి 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని దాని వలన పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీ ఆపాలని కోరింది. దీంతో జూహీచావ్లాతో పాటు మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని కేంద్రం కూడా తమ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు జూహీ చావ్లాతో పాటు మరో ఇద్దరికీ 20 లక్షల జరిమానా విధించింది. అయితే దీనికి సంబంధించి జుహీ ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

    English summary
    The Delhi High Court dismissed the lawsuit filed by actor-environmentalist Juhi Chawla against the setting up of 5G wireless networks in the country, and also imposed a fine of Rs 20 lakh for the abuse of the process of law.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X