‘ధిశ సలియాన్‌ను రేప్ చేసి హింసించి చంపారు.. ఆ పార్టీలో ఆ నేతలు ఎవరు?’ మీడియాలో ప్రశ్నల పరంపర
దిశా సలియాన్‌ది సూసైడ్ కాదని ఆమెది హత్యే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సమయంలో ముంబై పోలీసులు తాజాగా ఓ ప్రకటన చేశారు. సుశాంత్ సింగ్ మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశ సలియాన్ అనుమానస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తన మరణానికి ముందు హాజరైన ఓ పార్టీ కారణంగా దిశ మరణించారనే విషయం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ క్రమంలో ముంబై డీసీడీ విశాల్ ఠాకూర్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

దిశ పాల్గొన్న పార్టీలో గొడవ
దిశ సలియాన్ మరణం జూన్ 9 తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఆమె తన మరణానికి ముందు ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో జరిగిన గొడవనే ఆమె మరణానికి కారణం. అయితే ఆ పార్టీలో కొందరు ఆమెతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉందనే వాదనలు సోషల్ మీడియాలో సునామీలో కనిపిస్తున్నాయి. దిశతో జరిగిన గొడవనే సుశాంత్ మరణానికి కూడా కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ మరణించిన రెండు రోజులకు పోస్ట్ మార్టమ్
దిశ సలియాన్ పోస్టు మార్టం నిర్వహణ కూడా మీడియాలో చర్చనీయాంశమైంది. జూలై 8 తేది అర్ధరాత్రి మరణిస్తే దిశ పోస్టు మార్టంను రెండు రోజుల తర్వాత నిర్వహించారు. అలా పోస్ట్ మార్టమ్‌ను ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? ఆ రెండు రోజులు పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు ఆపారు? అందుకు కారణమైన నేతలు, సినీ ప్రముఖులు ఎవరు? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతున్నది.

దిశ, సుశాంత్ మరణాలపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో దిశ సలియాన్ మృతి లింక్ ఉందనే నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత, రాజ్యసభ్యుడు నారాయణరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దిశా సలియాన్‌ది హత్యే అంటూ ఆరోపించారు. జూన్ 8 నుంచి 13 వరకు జరిగిన పార్టీలో ఎవరెవరు ఉన్నారో బయటపెట్టాలి. దిశను రేప్ చేసి తీవ్రంగా హింసించి చంపారు అని రాణే డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో దిశ మృతిపై అనేక అనుమానాలు
ఇలాంటి డిమాండ్ల మధ్య దిశ సలియాన్ పోస్ట్ మార్టం రిపోర్టు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎత్తైన భవనం నుంచి పడిన దిశా శరీరంపై పలు రకాల గాయాలు ఉన్నాయి. అనుమానాస్పదంగా తలకు గాయాలయ్యాయి అనే విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఆమె పోస్టు మార్టం రిపోర్టుల గురించి స్పందించారు.
Recommended Video

పోస్టు మార్టం రిపోర్టులపై ముంబై డీసీపీ స్పందన
దిశ సలియాన్‌ది మర్డర్ అనే నెటిజన్ల కామెంట్లు మా దృష్టికి వస్తున్నాయి. వాటిని మేము జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతున్నందున్న కామెంట్ చేయడం బాగుండదు. దిశకు సంబంధించిన విసేరా రిపోర్టులు ఇంకా అందలేదు. ఆ రిపోర్టులు అందిన తర్వాత వాటిపై దర్యాప్తు చేస్తాం అని డీసీపీ విశాల్ థాకూర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











