బంగారు బాతును పట్టేసిన ప్రియాంక చోప్రా
అంతర్జాతీయ స్థాయిలో రఫ్పాడించేస్తున్న ప్రియాంకా చోప్రా మరో నిఖార్సైన ప్రాజేక్ట్ ను పట్టేసింది. క్వాంటికో అనే సిరీస్ ద్వారా గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ప్రియాంకా, ఇటీవలే స్కై ఈజ్ పింక్ అనే సినిమాలోనూ కనిపించింది. ఓ వైపు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను, మరోవైపు హాలీవుడ్ ప్రాజెక్ట్ లను బ్యాలెన్స్ చేసుకుంటూనే, నిక్ జోనాస్ తో వైవాహిక జీవితాన్ని ఆశ్వాదిస్తున్న పీసీ, ఇప్పుడు మరో అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో మెరిసేందుకు సిద్ధమవుతోంది.
మల్టీ మిలియన్ డాలర్ల టెలివిజన్ డీల్ పై సంతకాలు చేసిన ప్రియాంకా... ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ తో చేతులు కలపబోతున్నట్లు వెల్లడించింది. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఈ శుభవార్తలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ, స్త్రీవాద కథలు చెప్పేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నానని తెలిపిన పీసీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మకమైన రచయితలతో కలసి పనిచేయడం తన అదృష్టమని తెలిపింది. అంతేకాదు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తాను ఏ భాష వారికైనా దగ్గర కాగలనని ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











