దేశీ గర్ల్ ప్రేమాయణానికి 2వ వార్షికోత్సవం, నిక్ కు ముచ్చటైన మాట చెప్పిన ప్రియాంక

ఇటీవలే పుట్టినరోజు పురస్కరించుకుని ప్రపంచం నలుమూల నుంచి వెల్లువెత్తిన ప్రేమైక శుభాకాంక్షలతో తడిసి ముద్దైన ప్రియాంకా చోప్రా, ఆ మత్తు నుంచి బయటపడక ముందే, తన జీవితంలో మరో ముఖ్యమైన రోజును గుర్తుచేసుకుని ఉబ్బితబ్బిబవుతోంది. నిక్ జోనాస్ తో ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో ఓ చక్కని పోస్ట్ పెట్టి భర్తకు కృతజ్ఞతలు చెప్పుకుంది.

భర్త నిక్ ను ఉద్దేశిస్తూనే పోస్ట్ పెట్టిన ప్రియాంకా చోప్రా, సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే సమయంలో నిక్ తన ముందు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినట్లు తెలిపింది. అతడు మనసులో మాట చెప్పగానే నోట మాటరాలేదంటూనే, అప్పటి నుంచి ప్రతీ రోజు దానికి అంగీకారం తెలుపుతూనే ఉన్నానంటూ రాసింది. ఈ వారాంతాన్ని జీవితాంతం గుర్తిండిపోయేంత మధురంగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, తాను ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్ఠవంతురాలిని అంటూ పేర్కొంది.

Desi Girl goes down Memory lane, Celebrates 2years of Togetherness with Nick

ఇక ప్రియాంక పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమె భర్త నిక్ జోనాస్ పెట్టిన పోస్ట్ గురించి తెలిసిందే. ఒకరి కళ్లలోకి మరొకరు తదేకంగా చూసుకుంటోన్న ఫొటోనూ షేర్ చేస్తూ, జీవితాంతం ఇలాగే గడిపేయగలను అని నిక్ పెట్టి పోస్ట్ కు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. మరి సామాజిక మాధ్యమంలో ప్రేమాప్యాయతలు కలబోసుకుంటోన్న ఈ ముచ్చటైన జంట ఇదే విధంగా కలకాలం ఉండాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X