కురులకు కత్తెర... కొత్త పాత్రకోసం దేశీ గర్ల్ ఆరాటం..

లాక్ డౌన్ లో సోషల్ మీడియా ద్వారా జనాలకు టచ్ లోనే ఉన్న దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా, ఈ నేపథ్యంలో భర్త నిక్ జోనాస్ తో కలసి సమయాన్ని ఎలా గడుపుతున్నది, తామిద్దరూ కలసి చేసిన చారిటీ పనుల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఇక ఇటీవలే పీసీ పోస్ట్ చేసిన ఓ వీడియోలో అమ్మడు లుక్స్ పై అందరి దృష్టి పడింది.
తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రియాంకా కొత్తగా కనిపించడంతో, జనాల్లో ఆసక్తి పెరిగింది.

దీంతో, ఈరోజు అఫీషియల్ గా తన కొత్త లుక్స్ ను రివీల్ చేసింది పీసీ. పొడువాటి నల్లని కురులతోనే దర్శనమిస్తూ ఉండే ప్రియాంకా చోప్రా, అంతకు ముందెప్పుడూ తన గిరిజాలపై ప్రయోగాలు చేయలేదు. ఇక తాజాగా కొత్త హెయిర్ కట్ తో పీసీ దర్శనమిచ్చేసరికి ఫ్యాషన్ ప్రపంచం మొత్తం అమ్మడి వైపే చూస్తోంది.

Desi Girls goes crazy, PC new hairstyle wins internet

వీడియో కాల్ ద్వారా టొరొంటో ఫిల్మ్ ఫెస్టివర్ కు హాజరైన ప్రియాంకా చోప్రా, భుజాల వరకూ కట్ చేసిన జుట్టుతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ న్యూ హెయిర్, డోన్ట్ కేర్ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటో పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల వ్యవధిలోనే అది వైరల్ గా మారింది. అమ్మడి కొత్త హెయిర్ స్టైర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా, రాజ్ కుమార్ రావుతో కలసి వైట్ టైగర్ అనే సినిమాలో కనిపించబోతోంది. రుసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ సిరీస్ సిటాడెల్ లోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఇక కెనూ రీవ్స్ తో కలసి అమ్మడు మ్యాట్రిక్స్ 4లో తళుక్కుమనబోతున్న సంగతి తెలిసిందే. పీసీ కొత్త లుక్స్ వెనుక ఈ సినిమానే ఉందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X