రాయల్ వెడ్డింగ్ దేశీ వెర్షన్: రిషి కపూర్ వీడియో వైరల్
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ వివాహం గత శనివారం లండన్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మే 19న జరిగిన ఈ రాయల్ వెడ్డింగ్ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఈ రాయల్ వెడ్డింగ్ గురించి ఓ వీడియో పోస్టు చేశారు. పాత హిందీ సినిమాలోని డైలాగులు జోడించి దేశీ వెర్షన్ రాయల్ వెడ్డింగ్ పేరుతో ఆయన ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'హిందీలో అనువదించబడిన రాయల్ వెడ్డింగ్ సెర్మనీ, ఇండియాలో మాత్రమే రిలీజ్ అయింది' అంటూ ఆయన ఈ పోస్టు చేశారు. ఈ వీడియో అందరి మొహాల్లో నవ్వులు పూయిస్తోంది. దీన్ని చూసిన అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

1960లో వచ్చిన క్లాసిక్ మూవీ 'జిస్ దేశ్ మే గంగా బెహ్‌తి హై' సినిమాలో డైలాగులను జోడించి ఈ వీడియో క్రియేట్ చేశారు. ఆ సినిమాలో హీరో రాజ్ కపూర్ పద్మిణికి ప్రపోజ్ చేసే సీన్లోని డైలాగ్స్‌తో సాగే వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











