‘భరత్’ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు?

By Bojja Kumar

అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ నడుస్తుందనేది కాదనలేని విషయం. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో మేల్ స్టార్స్ తీసుకునే దాంట్లో సగం కూడా ఫిమేల్ స్టార్స్ పొందండం లేదు. ఈ విషయంలో మాకూ సమానత్వం కావాలని కొందరు హీరోయిన్లు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల పద్మావత్ సినిమాకు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కంటే దీపిక ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమాకు దీపిక రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇపుడు అదే స్థాయి రెమ్యూనరేషన్ అందుకుంటూ ప్రియాంక చర్చనీయాంశం అయ్యారు.

సల్మాన్ ఖాన్ ‘భరత్'లో ప్రియాంక

సల్మాన్ ఖాన్ ‘భరత్'లో ప్రియాంక

సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ రూపొందిస్తున్న ‘భరత్' అనే చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో నటించినందుకుగాను ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతోందని సమాచారం.

ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రియాంక చోప్రా ‘భరత్' చిత్రానికి రూ. 14 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కు ఇంత భారీ మొత్తం ఇవ్వలేదు. చివరకు రూ. 12 కోట్లకు డీల్ ఓకే అయినట్లు సమాచారం. ఇంతకుముందు పద్మావతి చిత్రానికి దీపిక పదుకోన్ రూ. 12 కోట్లు భారీ మొత్తం అందుకుంది.

రెమ్యూనరేషన్లో భారీ అసమానతలు

రెమ్యూనరేషన్లో భారీ అసమానతలు

సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది కానీ..... సల్మాన్ ఖాన్ అందుకునే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమే అని చెప్పక తప్పదు.

తక్కు మొత్తమే అంటున్న ప్రియాంక

తక్కు మొత్తమే అంటున్న ప్రియాంక

ఇటీవల ఓ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.... అమెరికాలో అయినా ఇండియాలో అయినా, పెద్ద యాక్టర్లతో సినిమా చేస్తున్నపుడు రెమ్యూనరేషన్ల విషయంలో అసమానతలు భారీగా కనిపిస్తాయి. ఒక స్టార్ హీరో రూ. 100 కోట్లు తీసుకుంటే.... హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో రూ. 8 కోట్ల నుండి చర్చలు మొదలు పెడతారు అని తెలిపారు.

లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీ

లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీ

ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలో కనిపించి చాలా కాలం అయింది. అటు అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో, హాలీవుడ్ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్న ఆమె ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ ‘భరత్' మూవీ ద్వారా ఇండియన్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X