దటీజ్ సంజయ్ దత్.. దర్శకుడు దేవకట్టా ప్రశంసల వర్షం... ప్రస్థానం రీమేక్ గురించి
టాలీవుడ్‌లో ప్రస్థానం చిత్రం సెన్సేషనల్ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం ద్వారా దేవకట్టాకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. అయితే దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నది. హిందీ రీమేక్‌కు కూడా దేవ కట్టా దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంలో సంజయ్ దత్, మనీషా కోయిరాలా, జాకీ ష్రాఫ్, అలీ ఫైజల్ నటిస్తున్నారు. ఈ సందర్బంగా హిందీ ప్రస్థానానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను దేవ కట్టా అందించారు.
హిందీ ప్రస్థానం సినిమాను జనరంజకంగా ప్రేక్షకులకు అందించేందుకు సంజయ్ దత్, మాన్యత తమ వంతు కృషి చేస్తున్నారు అని తెలిపారు. తెలుగులో ప్రస్థానం రిలీజ్ అయిన తర్వాత రెండేళ్లకు 2011-12 సంవత్సరంలో సంజయ్ దత్ రీమేక్ చేయడానికి చాలా ఉత్సాహం చూపారు. అయితే ఊహించని విధంగా ఆయన జైలుకు వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. జైలుశిక్ష్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రస్థానం సినిమాను తెరకెక్కిద్దామని ముందుకొచ్చారు.

అయితే ఆ సమయంలో సంజయ్ దత్‌తో సినిమాను తీయడానికి ఓ నిర్మాత సంప్రదించగా.. ఆయన ప్రస్థానం డీవీడీని చూపించి.. రైట్స్ మనవద్దే ఉన్నాయి. ఈ సినిమాను తీద్దాం అని సూచించారట. దాంతో ప్రస్థానం హిందీలో రీమేక్ కావడం జరిగింది. సంజయ్ దత్ లేకపోతే ప్రస్థానం సినిమా హిందీలో సాధ్యమయ్యేది కాదు అని దేవ కట్టా అన్నారు.


Click it and Unblock the Notifications











