Devara ఎన్టీఆర్ షూటింగులో సైఫ్ ఆలీఖాన్‌కు గాయం.. ముంబై హాస్పిటల్‌లో చేరిన దేవర విలన్!

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తీవ్ర అస్వస్థతతో హస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఆయనను కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరారు. ఇటీవల ఆయన పాల్గొన్న దేవర సినిమా షూటింగులో యాక్షన్ సీన్లలో నటిస్తున్న సమయంలో గాయపడటంతో సైఫ్‌కు ట్రసెప్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత ఆయన మీడియాకు తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలిపారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

ఇటీవల దేవర సినిమాలో యాక్షన్ సీన్లలో ఫైట్స్ సందర్భంగా గాయమైంది. దాంతో వైద్యులు సర్జరీ చేశారు. నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ చాలా సేఫ్ జరిగింది. నా ఆరోగ్యం కోసం ఆందోళన చెందకూడదు. నా గురించి, నా క్షేమం గురించి ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అని సైఫ్ అన్నారు. త్వరలోనే ఆయనను హస్పిటల్ నుంచి విడుదల చేస్తారని తెలిసింది.

Devara Fame Saif Ali Khan joined Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai for Tricep Surgery

ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కూడా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సందర్బంగా సైఫ్‌ఫై కీలక సన్నివేశాలను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఇటీవల చిత్రీకరించారు.

ఇటీవల సైఫ్ నటిస్తున్న దేవర చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆయన లుక్‌కు, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Devara Fame Saif Ali Khan joined Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai for Tricep Surgery

ఇదిలా ఉండగా, ఇటీవల పాన్ ఇండియాగా తెరకెక్కిన ప్రభాస్, కీర్తి సనన్ నటించిన ఆది పురుష్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ చిత్రంలో రావణుడిగా సైఫ్ తనదైన శైలిలో నటించి మెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X