For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆదిపురుష్’లో హనుమంతుడు అతడే: ప్రభాస్‌కు బంటుగా మారిన సీరియల్ యాక్టర్

    |

    ఇంత కాలం తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపించి.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ రామాయణం నాటి కథతో వస్తోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఇటీవలే చిత్రకరణను నిలిపేశారు. ఇక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో షూట్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ అప్‌డేట్ వచ్చింది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో హనుమంతుడిగా మరాఠా నటుడు దేవదత్తా నాగే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు సమచారం. 'దేవ్యానీ', 'జై మల్హార్' వంటి సీరియళ్లతో ఫేమస్ అయిన ఈ నటుడు.. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించాడు. వీటిలో 'సత్యమేవ జయతే', 'తానాజీ' వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే ఓం రౌత్ ఆయనను హనుమంతుడి పాత్రకు తీసుకున్నట్లు తెలిసింది. ఇక, దేవదత్తాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.

     Devdutta Nage playing Hanuman Role in Adipurush

    రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కథతో వస్తున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Young Rebel Star Prabhas Now Doing Adipurush Movie Under Om Raut Direction. Devdutta Nage playing Hanuman Role In This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X